MI vs SRH, IPL2024: రాణించిన హార్దిక్, చావ్లా.. ఆఖరులో కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?

Mumbai Indians vs Sunrisers Hyderabad: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ బ్యాటర్లు పూర్తిగా నిరాశ పర్చారు. ముంబయి ఇండియన్స్ తో వాంఖడే మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో ఓపెనర్‌ ట్రావిస్ హెడ్‌ (48) టాప్‌ మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయలేదు

MI vs SRH, IPL2024: రాణించిన హార్దిక్, చావ్లా.. ఆఖరులో కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
Mumbai Indians vs Sunrisers Hyderabad
Follow us

|

Updated on: May 06, 2024 | 9:51 PM

Mumbai Indians vs Sunrisers Hyderabad: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ బ్యాటర్లు పూర్తిగా నిరాశ పర్చారు. ముంబయి ఇండియన్స్ తో వాంఖడే మైదానం వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో ఓపెనర్‌ ట్రావిస్ హెడ్‌ (48) టాప్‌ మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. అయితే ఆఖరులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( 17 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఎస్ ఆర్ హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ‌ (11), నితీశ్‌రెడ్డి (20), జాన్‌సేన్‌ (17), షాబాజ్‌ (10)మయాంక్‌ అగర్వాల్ (5), హెన్రిచ్ క్లాసెన్‌ (2) ఇలా టాప్, మిడిలార్డర్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో పీయూష్‌ చావ్లా, హార్దిక్‌ పాండ్యా చెరో 3 వికెట్లు పడగొట్టారు. కంబోజ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు. ప్లేఆఫ్ పరంగా ఈ మ్యాచ్ హైదరాబాద్‌కు కీలకం. మరి ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలుస్తుందా లేక ముంబై తమ చివరి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా? అన్నది ఆసక్తికరం.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ తరఫున ఓపెనర్ ట్రావిస్ హెడ్ ​30 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 48 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ 5 పరుగుల వద్ద ఔటయ్యాడు. నితీష్ రెడ్డి 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. పియూష్ చావ్లా హెన్రిక్ క్లాసెన్‌ను 2 పరుగుల వద్ద అవుట్ చేశాడు. మార్కో జాన్సెన్ 17 పరుగుల వద్ద ఔటయ్యాడు.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

ఇంపాక్ట్ ప్లేయర్లు:

నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

యాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్,

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మిడ్‌రేంజ్‌ బడ్జెట్‌లో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
మెట్రో ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.100తో రోజంతా ప్రయాణించవచ్చు
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి