IPL 2024: కింగ్ కోహ్లీ నో లుక్ సిక్స్.. దెబ్బకు స్టేడియం పైకప్పును తాకిన బంతి.. ధోని కూడా షాక్.. వీడియో
Royal Challengers Bengaluru vs Chennai Super Kings: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (మే 18) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ (RCB vs CSK) మధ్య బిగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.
Royal Challengers Bengaluru vs Chennai Super Kings: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం (మే 18) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ (RCB vs CSK) మధ్య బిగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్ స్టేజ్ లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. తద్వారా చెన్నైకి 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ తరఫున బ్యాటర్లందరూ అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా తొలి 3 ఓవర్లలోనే ఇద్దరు ఓపెనర్లు జట్టుకు మమెరుపు ఆరంభాన్ని అందించారు. విరాట్ కోహ్లీ (ఆరంభం నుంచే దూకుడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. నిజానికి తొలి ఓవర్‌లో ఎక్కువ పరుగులు రాలేదు. కానీ కోహ్లీ రెండో ఓవర్ నుంచి గేర్ మార్చి బౌండరీ, సిక్సర్ బాదాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లి కొట్టిన నో లుక్ సిక్స్ వికెట్ వెనుక నిలబడి ఉన్న ఎంఎస్ ధోనీని కూడా ఆశ్చర్యపరిచింది. మూడో ఓవర్ తొలి బంతికే విరాట్ ఈ నో లుక్ సిక్స్ కొట్టాడు. తుషార్ దేశ్ పాండే బంతిని విరాట్ తనకు తెలిసిన స్టైల్‌లో బ్యాట్‌ను ఊపుతూ, డీప్ బ్యాక్ వార్డ్ స్క్వేర్ వైపు భారీ సిక్స్ బాదాడు. కోహ్లి కొట్టిన 98 మీటర్ల ఈ భారీ సిక్సర్ చిన్నస్వామి స్టేడియం పైకప్పును తాకింది. కోహ్లీ కొట్టిన ఈ నో లుక్ సిక్స్ చూసి నాన్ స్ట్రైక్ లో ఉన్న కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఆశ్చర్యపోయాడు. ఎంఎస్ ధోనీ కూడా బంతిని చూస్తూనే ఉన్నాడు. కోహ్లి భార్య అనుష్క శర్మ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంలో మునిగి తేలింది.
అయితే ఈ ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. వర్షం ఆగిన తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే వర్షం కారణంగా పిచ్‌లో మార్పు వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న CSK బౌలర్లు పవర్ ప్లేలో RCB భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఓపెనర్ విరాట్ కోహ్లి 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ ఫాఫ్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన రజత్ 23 బంతుల్లో 43 పరుగులు చేయగా, అతనికి మంచి సహకారం అందించిన కెమెరాన్ గ్రీన్ 17 బంతుల్లో 38 పరుగులు చేశాడు. దినేష్ కార్తీక్ (14 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (16 పరుగులు) చేసి ఆర్సీబీకి భారీ స్కోరు అందించారు.
వీడియో ఇదిగో..
Two lavish strokes to take your mind away from the rain delay 😉
Virat Kohli gets the Chinnaswamy crowd going 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/AGRH9nx83N
— IndianPremierLeague (@IPL) May 18, 2024
డుప్లెసిస్ రియాక్షన్..
Faf Du Plessis’ reaction on Virat Kohli’s six. pic.twitter.com/KyeNmdG35m
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..