IPL 2024: కోట్లు నష్టపోయినా డోంట్ కేర్.. ఎస్ఆర్‌హెచ్ అభిమానుల కోసం కావ్యా మారన్ గొప్ప నిర్ణయం

IPL 2024 లో భాగంగా గురువారం (మే 16) నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు హైదరాబాద్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం ఎస్ ఆర్ హెచ్ అభిమానుల ఆశలను అడియాశలు చేసింది

IPL 2024: కోట్లు నష్టపోయినా డోంట్ కేర్.. ఎస్ఆర్‌హెచ్ అభిమానుల కోసం కావ్యా మారన్ గొప్ప నిర్ణయం
Kavya Maran
Follow us

|

Updated on: May 17, 2024 | 8:42 PM

IPL 2024 లో భాగంగా గురువారం (మే 16) నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు హైదరాబాద్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం ఎస్ ఆర్ హెచ్ అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. దీంతో వేలాది రూపాయలు పోగేసి కొన్ని మ్యాచ్ టిక్కెట్లు వృథా అయ్యాయి. అయితే తమ అభిమానుల కోసం SRH యజమాని కావ్య మారన్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వచ్చిన ప్రేక్షకుల డబ్బును వాపస్ ఇస్తామని ప్రకటించింది. త్వరలోనే ప్రేక్షకులకు డబ్బును రీఫండ్ చేయబోతున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. దీని ప్రకారం Paytm లేదా Paytm ఇన్‌సైడర్ ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేసిన వారికి వారి డబ్బు తిరిగి జమ కానుంది. దీని కోసం ఫ్రాంఛైజీ ఇమెయిల్ ద్వారా టికెట్లు కొన్న వారిని సంప్రదిస్తుంది. అయితే వాస్తవానికి, చాలా మంది అభిమానులు బ్లాక్ లో టికెట్లు కొన్నారు. ఇందుకోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. దీంతో బ్లాక్ లో టికెట్లు కొన్నవారంతా తెగ బాధపడిపోతున్నారు.

టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కావ్య మారన్ ఫ్రాంచైజీకి కోట్లలో నష్టం వాటిల్లనుంది. హైదరాబాద్ మ్యాచ్‌ల టిక్కెట్ ధర సాధారణంగా రూ.750 నుండి ప్రారంభమవుతుంది. స్టేడియం సామర్థ్యం 55 వేలు. ఇలాంటి పరిస్థితిలో, ఫ్రాంచైజీ టిక్కెట్లు అమ్మడం ద్వారా ప్రతి మ్యాచ్‌లో కోట్ల ఆదాయం వస్తోంది. అంతకుముందు తమ అభిమానుల కోసం హైదరాబాద్ యాజమాన్యం మరో మంచి పని చేసింది. మే 16వ తేదీ రాత్రి స్టేడియంలో లైటింగ్ షో ఏర్పాటు చేసింది. వర్షం కారణంగా విసుగు చెందిన అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి అర్ధరాత్రి వేళ ఈ లైట్ షో ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Paytm Insider (@insider.in)

ఉప్పల్ స్టేడియంలో లైట్ షో..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:

పాట్ కమిన్స్ (కెప్టెన్), జయదేవ్ ఉనద్కత్, జాతవేద్ సుబ్రమణియన్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, మార్కో జాన్సేన్, అబ్ రాహుల్ షర్కేన్, త్రిపాఠి, ఉపేంద్ర యాదవ్, ఐదాన్ మార్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఆకాష్ మహరాజ్ సింగ్, వనిందు హసరంగా,  ఉమ్రాన్ మాలిక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్