Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పుష్ప 2 రిలీజ్ వాయిదా! కారణమిదే

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప 2' కూడా ఒకటి. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పుష్ప 2 రిలీజ్ వాయిదా! కారణమిదే
Pushpa 2 Movie
Follow us

|

Updated on: May 16, 2024 | 7:44 PM

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఆగస్ట్ 15న విడుదల కానున్న ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా అనసూయ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప 2 లో ఆమె లుక్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ గురించి పలు గాసిప్‌లు వినిపిస్తున్నాయి . కొన్ని నెలల క్రితం ఈ సినిమా విడుదల తేదీపై పుకార్లు వచ్చాయి. దీంతో చిత్ర బృందం బన్నీ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని కుండ బద్దలు కొట్టింది. ఇప్పుడు మళ్లీ ‘పుష్ప 2’ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందనే ప్రచారం మొదలైంది. ఇందుకు రెండు అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ అభిమానులు అయోమయంలో పడ్డారు. మళ్లీ సినిమా రిలీజ్ వాయిదా తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు.

పుష్ప 2 సినిమా ఎడిటర్‌లో మార్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆంటోనీ రూబెన్‌ డేట్స్‌ విషయంలో సమస్యలు రావడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎడిటింగ్‌ బాధ్యతలను పూర్తి చేయడానికి నవీన్‌ నూలిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కానీ రిలీజ్ డేట్ వాయిదాపై అనుమానం రావడానికి ఇదే మొదటి కారణం. ‘పుష్ప 2’ షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం రెండో కారణం. రిపోర్ట్స్ ప్రకారం, అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ మే నెల అంతా ఉంటుంది. మిగిలిన సన్నివేశాలను కూడా జూన్ నెలలో చిత్రీకరిస్తారని సమాచారం. అందుకే ఆగస్ట్ 15కి పుష్ప 2 సినిమా రెడీ అవుతుందా లేదా అన్న సందేహం చాలా మందిలో నెలకొంది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా కల్కి లాంటి భారీ సినిమాలు తమ విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా అదే దారిలో పయనిస్తోందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆగస్ట్ 15 తేదీని ‘పుష్ప 2’ టీమ్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదని ఫ్యాన్స్ అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. జియో నుంచి చౌకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌
కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. జియో నుంచి చౌకైన ఇంటర్నెట్‌ ప్లాన్‌
ఒకప్పుడు కలెక్టర్ దగ్గర పనిచేసిన ఈ కుర్రాడు
ఒకప్పుడు కలెక్టర్ దగ్గర పనిచేసిన ఈ కుర్రాడు
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో 'C'ని కనిపెట్టండి చూద్దాం..
మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో 'C'ని కనిపెట్టండి చూద్దాం..
'కాంగ్రెస్ 420 హామీలకు గానూ ఒక్కటి మాత్రమే అమలు'.. కేటీఆర్ కౌంటర్
'కాంగ్రెస్ 420 హామీలకు గానూ ఒక్కటి మాత్రమే అమలు'.. కేటీఆర్ కౌంటర్
రోజూ ఈ 20నియమాలు పాటించి చూడండి జాతకంలో గ్రహ దోషాల నుంచి విముక్తి
రోజూ ఈ 20నియమాలు పాటించి చూడండి జాతకంలో గ్రహ దోషాల నుంచి విముక్తి
సమయం దగ్గర పడుతోంది మిత్రమా..! గడువు సమీపిస్తోంది
సమయం దగ్గర పడుతోంది మిత్రమా..! గడువు సమీపిస్తోంది
రాజధానిపై ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి.. మాజీ మంత్రి హరీష్
రాజధానిపై ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి.. మాజీ మంత్రి హరీష్
పరశురాముడు ఎందుకు భూమిని కశ్యప మహర్షికి దానం చేశాడో తెలుసా..!
పరశురాముడు ఎందుకు భూమిని కశ్యప మహర్షికి దానం చేశాడో తెలుసా..!
రూ. 20 వేలలో వైర్‌లెస్‌ ఛార్జర్‌తో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్
రూ. 20 వేలలో వైర్‌లెస్‌ ఛార్జర్‌తో పాటు మరెన్నో సూపర్ ఫీచర్స్
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలో తెలుసా?
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలో తెలుసా?