Prithviraj Sukumaran: ప్రభాస్ స్నేహితుడి ఆస్తుల వివరాలివే .. పృథ్వీరాజ్ సుకుమారన్ కార్ల కలెక్షన్ తెలిస్తే షాకే..

సలార్ తర్వాత ఆడు జీవితం సినిమాతో మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చాడు పృథ్వీరాజ్. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ సలార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు పృథ్వీరాజ్. ఈ క్రమంలో తాజాగా ఈ హీరో ఆస్తులు, కార్ల కలెక్షన్ వివరాలు నెట్టింట వైరలవుతున్నాయి

Prithviraj Sukumaran: ప్రభాస్ స్నేహితుడి ఆస్తుల వివరాలివే .. పృథ్వీరాజ్ సుకుమారన్ కార్ల కలెక్షన్ తెలిస్తే షాకే..
Prithviraj Sukumaran
Follow us

|

Updated on: May 16, 2024 | 9:29 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్ మూవీలో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా వరదరాజ్ మన్నార్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాతో ఇటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సలార్ తర్వాత ఆడు జీవితం సినిమాతో మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చాడు పృథ్వీరాజ్. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం పృథ్వీరాజ్ సలార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు పృథ్వీరాజ్. ఈ క్రమంలో తాజాగా ఈ హీరో ఆస్తులు, కార్ల కలెక్షన్ వివరాలు నెట్టింట వైరలవుతున్నాయి.

2002లో నందనం సినిమాతో నట ప్రయాణం మొదలుపెట్టాడు. 2006లో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన క్లాస్ మేట్స్ సినిమాతో హీరోగా పృథ్వీరాజ్ కెరీర్ టర్న్ అయ్యింది. ఆ తర్వాత అనేక హిట్ చిత్రాల్లో నటించారు. వాస్తవం, మోజి, ఎజ్రా వంటి హిట్ చిత్రాలతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. తిరువనంతపురంలో జన్మించిన పృథ్వీరాజ్.. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు, కానీ నటనను కొనసాగించడానికి తన చదువును విడిచిపెట్టాడు. ఆస్ట్రేలియాలో చదువుతున్న సమయంలోనే ఫస్ట్ మూవీ ఛాన్స్ అందుకున్నాడు. సెల్యులాయిడ్, ముంబయి పోలీస్, మెమరీస్ ఎన్ను నింటె మొయిదీన్, ఎజ్రా, అయ్యప్పనుమ్ కోషియుమ్, కోల్డ్ కేస్, కురుతి, బ్రహ్మం, బ్రా డాడీ, జన గణ మన, చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు.

నివేదికల ప్రకారం పృథ్వీరాజ్ ఆస్తి రూ.54 కోట్లు ఉంటుందని సమాచారం. నటుడిగానే కాకుండా సింగర్, నిర్మాతగా రాణిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతి చిత్రానికి రూ. 4-10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు. 2018లో పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌ను స్థాపించాడు. కేరళలోని కొచ్చిలోని ఒక విలాసవంతమైన ఇంటిని కలిగి ఉన్నాడు. ముంబైలోని బాంద్రాలోని పాలి హిల్‌లో రూ.17 కోట్ల విలువైన పారిశ్రమ్‌లోని ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. పృథ్వీరాజ్ వద్ద లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G 63, రేంజ్ రోవర్ వోగ్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 పోర్షే వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కదులుతున్న రైలు నుంచి పడి మరణిస్తే పరిహారం ఉంటుందా?నిబంధనలు ఏంటి?
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కేవైసీ విషయంలో సెబీ కీలక నిర్ణయం.. లావాదేవీలు మరింత సులభం
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
కిర్గిస్థాన్‌లో ప్రాణభయంతో వణికిపోతున్న తెలుగు విద్యార్ధులు
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
టీ20 వరల్డ్ కప్‌లో ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
కూరల్లో ఉప్పు బాగా ఎక్కువైందా.. ఇలా చేస్తే సరి!
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
పదే పదే మిల్క్ టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ICMR హెచ్చరిక
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురూ.. బీజేపీ వాళ్లే..?
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
ఎన్నికల తర్వాత షాకివ్వనున్న టెలికం కంపెనీలు.. భారీగా పెరగనున్న...
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
కాళ్లున్న పామును మీరెప్పుడైనా చూశారా.. ఇదిగో వీడియో
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి
IRCTC టూర్.. 15వేలకే తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను చుట్టేయ్యండి