Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ ఎవరి ఫోటో ఉందో తెలుసా..? వైరలవుతున్న ఫోటోస్..

డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కియారా అద్వానీ, శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ సినిమా తర్వాత అటు డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చరణ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

Ram Charan: రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ ఎవరి ఫోటో ఉందో తెలుసా..? వైరలవుతున్న ఫోటోస్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 16, 2024 | 7:13 PM

ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు చరణ్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు చరణ్ పై విమర్శలు చేసిన బాలీవుడ్ మూవీ క్రిటిక్స్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ యాక్టింగ్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన అద్భుతమంటూ ఓ రేంజ్‏లో పొగిడేస్తున్నారు. ఇప్పుడు చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం వేయి కళ్లతో చూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కియారా అద్వానీ, శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ సినిమా తర్వాత అటు డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చరణ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

అదెంటంటే.. రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్. అవును.. చరణ్ తన ఫోన్ వాల్ పేపర్ గా ఎవరి ఫోటోను పెట్టుకున్నారో తెలిసిపోయిందట. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. చరణ్ తన ఫోన్ వాల్ పేపర్ గా భార్య ఉపాసన ఫోటో లేదా కూతురు క్లీంకార ఫోటో పెట్టుకోలేదు.. తమ కుటుంబ ఆరాధ్య దైవం అయిన ఆంజనేయ స్వామి ఫోటోను వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్ చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు చరణ్. రిపబ్లిక్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి తన భార్య ఉపాసనతో కలిసి హజరయ్యారు. ఈ క్రమంలోనే చరణ్ ఫోన్ వాల్ పేపర్ బయటపడింది.

Charan

Charan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
వెనక్కు తగ్గం.. సీబీఐ విచారణ ముందు కేటీఆర్ సంచలన ట్వీట్..
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా..
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు...అంతలో వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో