AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer: సుధీర్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్క పర్సన్ ఎవరు…? PSPK కాదు

బుల్లితెర హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్. జబర్దస్త్‌లో తన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా రష్మితో లవ్ అంటూ ఈయన మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయాడు.

Sudigali Sudheer: సుధీర్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్క పర్సన్ ఎవరు...? PSPK కాదు
Sudigali Sudheer
Ram Naramaneni
|

Updated on: May 16, 2024 | 7:31 PM

Share

సుడిగాలి సుధీర్.. ఇప్పుడు బుల్లితెరపై ఈ పేరు ఒక బ్రాండ్. సాధారణ స్థాయి నుంచి సెలబ్రెటిగా ఎదిగాడు. తొలుత మెజిషియన్‌గా పనిచేసి.. ఆపై అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వెళ్లాడు. అయితే జబర్దస్త్ సుధీర్ జీవితాన్ని మార్చేసింది. వండర్స్ వేణు టీంలో సభ్యుడిగా అడుకు పెట్టిన సుధీర్ మంచి ఫెర్మమెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వేణు జబర్దస్త్ నుంచి తప్పుకోగానే.. టీం లీడర్ గా మారి సుడిగాలి సుధీర్‌గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పాడు. సుధీర్ బుల్లి తెరతోనే ఆగిపోలేదు. వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తొలుత చిన్న, చిన్న పాత్రలు వేశాడు. ఆయన కామెడీ టైమింగ్, స్టైల్‌ను ఇష్టపడే జనాలు పెరిగిపోవడంతో హీరోగా మారాడు. 2019లో వచ్చిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో కథానాయకుడిగా మెరిశాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఆ తర్వాత త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు వంటి తన కెరీర్‌కు ఉపయోగపడని సినిమాలు చేశాడు. ఆ నెక్ట్స్ చేసిన.. గాలోడు సినిమా మనోడికి మంచి బ్రేక్ ఇచ్చింది. కమర్షియల్ సక్సెస్ అయింది. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో GOAT అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తనకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని సుధీర్ నమ్ముతున్నాడు. మరోవైపు ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు సుధీర్.

కాగా సుధీర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇన్ స్టాలో ఇతగాడిని 14 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే సుధీర్ తిరిగి ఫాలో అయ్యేది ఎవర్నో తెలుసా..? కేవలం ఒక్కర్నే… అది ఎవరో మీరు గెస్ చేయగలరా..?. తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను అయితే కాదు. సుధీర్ ఫాలో అయ్యేది పవర్ స్టార్ సోదరుడు, తెలుగు ప్రజల అభిమాన నటుడు చిరంజీవిని. అవును సుధీర్.. కేవలం మెగాస్టార్ ఒక్కడినే తన ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. మెగా కుటుంబాన్ని విపరీతంగా ఆరాధిస్తాడు సుధీర్. ముఖ్యంగా పవన్ అంటే ప్రాణం ఇస్తాడు. అలా అని చిరంజీవి ఫ్యాన్ కాదని కాదు. ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా చిరు ఇన్‌స్పిరేషన్ కదా. కాగా  పవన్ కోసం ఇటీవల పిఠాపురంలో ప్రచారం కూడా చేశాడు ఈ నటుడు. అయినా కానీ పవన్‌ను ఇన్ స్టాలో ఫాలో కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.