Love Me Trailer: దెయ్యం ప్రేమ కోసం హీరో ఆరాటం.. లవ్ మీ ట్రైలర్ చూశారా.. ?

'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీపై ముందు నుంచి క్యూరియాసిటిని నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ హార్రర్ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ చూస్తుంటే.. దెయ్యంతో హీరో ప్రేమాయణం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తూ అసలు విషయం చెప్పేశారు.

Love Me Trailer: దెయ్యం ప్రేమ కోసం హీరో ఆరాటం.. లవ్ మీ ట్రైలర్ చూశారా.. ?
Love Me Trailer
Follow us

|

Updated on: May 16, 2024 | 6:44 PM

యంగ్ హీరో ఆశిష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ లవ్ మీ. రౌడీ బాయ్స్ వంటి హిట్ అందుకున్న తర్వాత ఆశిష్ నటిస్తోన్న రెండో సినిమా ఇది. ఇందులో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ మీ.. ఇఫ్ యూ డేర్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీపై ముందు నుంచి క్యూరియాసిటిని నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ హార్రర్ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ చూస్తుంటే.. దెయ్యంతో హీరో ప్రేమాయణం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుందని హింట్ ఇచ్చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తూ అసలు విషయం చెప్పేశారు.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఎవరైనా వద్దన్న పనిని కావాలని చేసే హీరో.. రిస్క్ అని చెప్పినా వినకుండా దెయ్యం ఉండే భవనానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన వాళ్లందరిని చంపేసిన దెయ్యాన్ని ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆ దెయ్యాన్ని చూడాలని ప్రయత్నిస్తాడు. రోజు రాత్రి ఎనిమిది గంటలకు అలారం మోగుతుంది.. వెంటనే ఆ భవనానికి చుట్టు పక్కల ఉన్నవారు ఇంటి తలుపులు మూసేస్తారు. కానీ ఓ అమ్మాయి మాత్రం తలుపు తెరచి చూసి భయంతో అరుస్తుంది. ఇక ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ చూపిస్తూ వచ్చిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి.

ట్రైలర్ చివరి వరకు ఈ సినిమాలో దెయ్యం ఎవరన్నది రివీల్ చేయలేదు. దెయ్యం ప్రేమ కోసం వెళ్లిన ఆ హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. ? అందరిని దారుణంగా చంపేసిన ఆ దెయ్యం చివరకు హీరోను వదిలిపెట్టిందా ? అనేది తెలియాలంటే లవ్ మీ సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాను మే 25న విడుదల చేయనున్నారు. ఇందులో సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
త్వరలో ఆ బంగారానికి కూడా హాల్ మార్క్.. అదే కారణమంటున్న నిపుణులు
త్వరలో ఆ బంగారానికి కూడా హాల్ మార్క్.. అదే కారణమంటున్న నిపుణులు
ఈ అలవాట్లను ఫాలో చేస్తే.. మీ బ్రెయిన్ పవర్ ఫు‌ల్‌ అవ్వడం ఖాయం!
ఈ అలవాట్లను ఫాలో చేస్తే.. మీ బ్రెయిన్ పవర్ ఫు‌ల్‌ అవ్వడం ఖాయం!
సెల్‌ఫోన్ విషయంలో వివాదం తల్లిదండ్రులతో పాటు అక్కని చంపిన బాలుడు
సెల్‌ఫోన్ విషయంలో వివాదం తల్లిదండ్రులతో పాటు అక్కని చంపిన బాలుడు
రూ. 5 కోసం ఇంతలా బరితెగించారేంట్రా.. పోలీసుల ఎంట్రీతో..
రూ. 5 కోసం ఇంతలా బరితెగించారేంట్రా.. పోలీసుల ఎంట్రీతో..
ఆధార్‌ను పదేళ్లు అప్‌డేట్ చేయకపోతే ఇన్‌వ్యాలీడ్..?
ఆధార్‌ను పదేళ్లు అప్‌డేట్ చేయకపోతే ఇన్‌వ్యాలీడ్..?
తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు
తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు
ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రో నీ సినిమాలో..
ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రో నీ సినిమాలో..
ఆ జిల్లాలో జోరుగా సాగుతున్న బెట్టింగ్ యవ్వారం.. గెలుపుపై ఉత్కంఠ..
ఆ జిల్లాలో జోరుగా సాగుతున్న బెట్టింగ్ యవ్వారం.. గెలుపుపై ఉత్కంఠ..
నిస్సాన్ కార్ల ప్రియులకు శుభవార్త..జిజా న్యూ వెర్షన్ రిలీజ్..!
నిస్సాన్ కార్ల ప్రియులకు శుభవార్త..జిజా న్యూ వెర్షన్ రిలీజ్..!
చైనాను భారత్ ఎలా అధిగమిస్తుంది? నారాయణమూర్తి చెప్పిన సూత్రం ఏంటి?
చైనాను భారత్ ఎలా అధిగమిస్తుంది? నారాయణమూర్తి చెప్పిన సూత్రం ఏంటి?