Vijay Deverakonda: అరరె.. ఆ బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్సైన దేవరకొండ.. విజయ్ రిజెక్ట్స్ చేసిన మూవీస్ ఇవే..

కానీ ఆ తర్వాత విజయ్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. కానీ తనదైన నటనతో ఎప్పటికప్పుడు ప్రశంసలు అందుకుంటూ హీరోగా దూసుకుపోతున్నాడు విజయ్. ప్రస్తుతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా. ఇదిలా ఉంటే.. విజయ్ కెరీర్ లో చాలా హిట్స్ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాడు.

Vijay Deverakonda: అరరె.. ఆ బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్సైన దేవరకొండ.. విజయ్ రిజెక్ట్స్ చేసిన మూవీస్ ఇవే..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: May 16, 2024 | 6:25 PM

కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో రౌడీ హీరో అనే స్టార్ ట్యాగ్ అందుకున్నాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా విజయ్ కెరీర్‏ను మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత విజయ్ వెనుదిరిగి చూడలేదు. అర్జున్ రెడ్డి తర్వాత గీతా గోవిందం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత విజయ్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. కానీ తనదైన నటనతో ఎప్పటికప్పుడు ప్రశంసలు అందుకుంటూ హీరోగా దూసుకుపోతున్నాడు విజయ్. ప్రస్తుతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నా. ఇదిలా ఉంటే.. విజయ్ కెరీర్ లో చాలా హిట్స్ ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేశాడు.

విజయ్ వదులుకున్న సినిమాలతో ఇతర స్టార్స్ భారీ విజయాలను అందుకున్నారు. ఇంతకీ విజయ్ రిజెక్ట్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటో తెలుసుకుందామా. భీష్మ… 2020లో యంగ్ హీరో నితిన నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ మూవీ స్క్రిప్ట్ ముందుకు విజయ్ దేవరకొండకు వచ్చింది. కొన్ని కారణాలతో విజయ్ వదిలేయాల్సి వచ్చింది.

అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మొదట విజయ్ కు వచ్చింది. డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ కావడంతో కాస్త సందేహించాడు విజయ్. దీంతో ఈ ప్రాజెక్ట్ రామ్ చెంతకు చేరింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది. అలాగే యంగ్ హీరో కార్తీకేయ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సిందే. ఈ సినిమాకు ముందుగా విజయ్ అనుకున్నారట. కానీ అర్జున్ రెడ్డి స్టోరీలాగే ఉందని రిజెక్ట్ చేశారట. ఇక మెగా హీరో వైష్ణవ్ తేజ నటించిన ఉప్పెన సినిమాకు విజయ్ ఫస్ట్ ఛాయిస్. చివరకు వైష్ణవ్ హీరోగా పరిచయమయ్యాడు. కొన్ని కారణాలతో విజయ్ ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను మిస్ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.