AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిపించి.. డిన్నర్‌ ఏర్పాటు చేసిన లక్నో ఓనర్.. అతియా ఏమందంటే?

లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా, జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య వారం రోజుల క్రితం పబ్లిక్ గా  జరిగిన  మాటల యుద్ధం ఎట్టకేలకు ముగిసినట్లు తెలుస్తోంది . గత వారం రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.

IPL 2024: కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిపించి.. డిన్నర్‌ ఏర్పాటు చేసిన లక్నో ఓనర్.. అతియా ఏమందంటే?
KL Rahul, Athiya Shetty
Basha Shek
|

Updated on: May 14, 2024 | 9:31 PM

Share

లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా, జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య వారం రోజుల క్రితం పబ్లిక్ గా  జరిగిన  మాటల యుద్ధం ఎట్టకేలకు ముగిసినట్లు తెలుస్తోంది . గత వారం రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆ ఊహాగానాలన్నింటికీ ముగింపు పలికారని సమాచారం. నిజానికి లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు మంగళవారం (మే14) డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రస్తుత పుకార్లకు ముగింపు పలకాలనుకున్నాడు లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా. అందుకే ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను తన ఇంటికి ఆహ్వానించి అతనితో కలిసి డిన్నర్ చేశాడు. అలాగే ఒకరినొకరు కౌగిలించుకోవడం ద్వారా మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. సంజీవ్ గోయెంకా, KL రాహుల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, సంజీవ్ గోయెంకా మరియు KL రాహుల్ ఒకరినొకరు కౌగిలించుకోవడం చూడవచ్చు.

గత వారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత, లక్నో సూపర్ జెయింట్‌ టీమ్ వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ చేతిలో లక్నో ఘోర పరాజయం తర్వాత, సంజీవ్ గోయెంకా బహిరంగంగా KL రాహుల్‌పై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత లక్నో టీమ్‌లో అంతా బాగాలేదని పుకార్లు వచ్చాయి. సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ మధ్య జరిగిన ఈ ఘటనపై క్రికెట్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేఎల్ రాహుల్ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఓనర్ సంజీవ్ గోయెంకా స్వయంగా కేఎల్ రాహుల్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి జట్టు నుంచి తప్పించేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ఫోటో చూస్తే లక్నో టీమ్ లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ డిన్నర్ భేటీపై KL రాహుల్ భార్య, నటి అతియా శెట్టి కూడా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘తుఫాను తర్వాత ప్రశాంతత’ అని ఒక పోస్ట్ పెట్టింది. మరి ఆమె చెప్పినట్లు రాహుల్, సంజీవ్ గోయెంకాల మధ్య వివాదం సద్దుమణిగినట్లే అనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..