OTT Movies: ఈ వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. శుక్రవారం (మే 17)జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను నటించిన రాజు యాదవ్ అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. దీంతో సినిమా ఆడియెన్స్ ఓటీటీల వైపు దృష్టి సారిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆసక్తికర సినిమాలు, సిరీస్ లతో మన ముందుకు వస్తున్నాయి

OTT Movies: ఈ వీకెండ్‌లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: May 17, 2024 | 7:00 AM

మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వారంలో కూడా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. శుక్రవారం (మే 17)జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను నటించిన రాజు యాదవ్ అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. దీంతో సినిమా ఆడియెన్స్ ఓటీటీల వైపు దృష్టి సారిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆసక్తికర సినిమాలు, సిరీస్ లతో మన ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు, సిరీస్ లు వివిధ ఓటీటీల్లోకి రాగా శుక్రవారం మరికొన్ని సినిమాల రిలీజ్ లు, స్ట్రీమింగ్ లు ఉండనున్నాయి. అందులో ది కేరళ స్టోరీ బ్యూటీ అదా శర్మ నటించిన బస్తర్: ది నక్సల్ స్టోరీ, రాజమౌళి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక విక్కీ కౌశల్, సారా అలీఖాన్ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ జర హట్కే జర బచ్ కూడా శుక్రవారం స్ట్రీమింగ్ కు రానుంది. మరి శుక్రవారంతో పాటు ఈ వీకెండ్ లో వివిధ ఓటీటీల్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లేంటో తెలుసుకుందాం రండి.

ఆహా ఓటీటీలో

ఇవి కూడా చదవండి
  • విద్యా వాసుల అహం- మే 17
  • షరతులు వర్తిస్తాయి- మే 18

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో…

  • 99 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 17

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా..

  • పవర్ (ఇంగ్లిష్ మూవీ) – మే 17
  • ద 8 షో (కొరియన్ వెబ్ సిరీస్) – మే 17
  • థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లిష్ సినిమా) – మే 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ ( యానిమేటెడ్ వెబ్ సిరీస్) – మే 17

జీ5

  • బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ సినిమా) – మే 17
  • తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) – మే 17

జియో సినిమా

  • జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) – మే 17

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • ఎల్లా (హిందీ సినిమా) – మే 17

Note: వీటితో పాటు  కొన్ని ఓటీటీ సంస్థలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.