AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. ఎక్కడ చూడొచ్చంటే..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరో రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ కీలకపాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా సినీ ప్రియులను ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. ఎక్కడ చూడొచ్చంటే..
Baahubali
Rajitha Chanti
|

Updated on: May 17, 2024 | 3:09 PM

Share

పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమా బాహుబలి. భారతీయ సినిమా చరిత్రలో ఈ మూవీ ప్రత్యేకం. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరో రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ కీలకపాత్రలు పోషించగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా సినీ ప్రియులను ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్స్ నిర్మించేందుకు అటు దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాహుబలి మళ్లీ వచ్చేసింది.. కానీ ఇక్కడే అసలు విషయం. బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ తో ఈ కథలోనే మరో కొత్త అధ్యాయం మొదలు అయ్యింది.

బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ వెబ్ సిరీస్‏ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై డైరెక్టర్ రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించారు. ఈ యానిమేటెడ్ సిరీస్‏కు జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ యానిమేటడ్ ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. అలాగే ఈసారి బాహుబలి కొత్త అధ్యాయంలో కట్టప్పే విలన్ గా చూపించారు. దీంతో ఇప్పుడు బాహుబలి యానిమేటెడ్ సిరీస్ పై మరింత ఆసక్తి పెరిగింది. బాహుబలి గ్రాఫిక్ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాళి, మరాఠీ, హిందీ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఈ సిరీస్ నుంచి కేవలం రెండు ఎపిసోడ్స్ మాత్రమే విడుదల చేశారు. ఆ తర్వాత వారానికి ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దాదాపు 8 భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.