Prasanna Vadanam OTT: అఫీషియల్.. ఆహాలో సుహాస్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచుతూ అగ్ర స్థానంలో దూసుకెళ్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ప్రతి వారం కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను రంజింప చేస్తోన్న ఆహా ఇప్పుడు మరో సూపర్ సక్సెస్‌ఫుల్ చిత్రం ‘ప్రసన్నవదనం’తో అలరించటానికి సిద్ధమైంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ రాబట్టుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్..

Prasanna Vadanam OTT: అఫీషియల్.. ఆహాలో సుహాస్ సైకలాజికల్ థ్రిల్లర్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Prasanna Vadanam Movie
Follow us

|

Updated on: May 17, 2024 | 7:46 PM

తెలుగు ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని పంచుతూ అగ్ర స్థానంలో దూసుకెళ్తోన్న ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. ప్రతి వారం కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను రంజింప చేస్తోన్న ఆహా ఇప్పుడు మరో సూపర్ సక్సెస్‌ఫుల్ చిత్రం ‘ప్రసన్నవదనం’తో అలరించటానికి సిద్ధమైంది. ఇటీవల బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ రాబట్టుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మే 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు సుహాస్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాశీ సింగ్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుషాలిని ఇతర ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. అర్జున్ వై.కె ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. లిటిల్ థాట్స్ సినిమాస్, మణికంఠ జె.ఎస్, ప్రసాద్ రెడ్డి టి.ఆర్ నిర్మించిన ఈ చిత్రానికి అర్హ మీడియా సహ నిర్మాతగా వ్యవహరించారు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా చూసి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ప్రొసోఫాగ్నోసియా (ముఖం, గొంతులను సరిగ్గా గుర్తుపట్టలేని వ్యాధితో బాధపడటం) అనే పాయింట్ కథ రన్ అవుతుంది. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారనే పాయింట్‌పై ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. ఈ యూనిక్ అంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. సినిమా కథాంశంతో పాటు నటీనటులు చక్కటి నటనతో సినిమాలోని పాత్రలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయటం మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. హీరో సుహాస్ ప్రొసోఫాగ్నోసియా లక్షణాలతో బాధపడే యువకుడిగా తెరపై చక్కటి మానసిక సంఘర్షణలను తెరపై పండించారు.

ఇవి కూడా చదవండి

డిఫరెంట్ కథలతో తెరకెక్కిన సినిమాలు ఆదరణ పొందుతున్న తరుణంలో ‘ప్రసన్నవదనం’ వంటి సినిమా ఓటీటీ మాధ్యమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావటం అనేది కొత్త కథాంశాలతో సినిమాలు చేయాలనుకునే వారికి మరింత శక్తినిచ్చేలా ఉంది. ఇలాంటి దృక్పథాల కారణంగా మరిన్ని వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయనటంలో సందేహం లేదు. మే 24న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘ప్రసన్నవదనం’ సినిమాను మిస్ చేసుకోవద్దు. ఓ వైపు ఆలోచన రేకెత్తిస్తూనే తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అసల్సు వదులుకోకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్