Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ Vs గ్యాంగ్‌స్టర్స్.. నడిరోడ్డుపై హాలివుడ్ మూవీ యాక్షన్ సీన్

పోలీస్ Vs గ్యాంగ్‌స్టర్స్.. నడిరోడ్డుపై హాలివుడ్ మూవీ యాక్షన్ సీన్

Phani CH
|

Updated on: May 18, 2024 | 2:41 PM

Share

ఫ్రాన్స్‌లో డ్రగ్స్‌ గ్యాంగ్‌ బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న కాన్వాయ్‌పై హాలీవుడ్ సినిమా తరహాలో భారీ గన్స్‌తో దాడి చేసి.. గార్డులను చంపి మరీ గ్యాంగ్‌ లీడర్‌ను విడిపించుకుపోయింది. దీంతో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్‌ మార్కెట్‌గా పేరున్న ఫ్రాన్స్‌లో మహమ్మద్‌ అమ్రా ఓ మాదకద్రవ్యాల గ్యాంగ్‌కు అధిపతి. ‘ది ఫ్లై’ పేరుతో అమ్రాను పిలుస్తారు.

ఫ్రాన్స్‌లో డ్రగ్స్‌ గ్యాంగ్‌ బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న కాన్వాయ్‌పై హాలీవుడ్ సినిమా తరహాలో భారీ గన్స్‌తో దాడి చేసి.. గార్డులను చంపి మరీ గ్యాంగ్‌ లీడర్‌ను విడిపించుకుపోయింది. దీంతో ఫ్రాన్స్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. నిందితుల కోసం దేశవ్యాప్తంగా గాలింపు మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్‌ మార్కెట్‌గా పేరున్న ఫ్రాన్స్‌లో మహమ్మద్‌ అమ్రా ఓ మాదకద్రవ్యాల గ్యాంగ్‌కు అధిపతి. ‘ది ఫ్లై’ పేరుతో అమ్రాను పిలుస్తారు. అతడిని అరెస్టు చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఓ దోపిడీ కేసులో మే 10న 18 నెలలు శిక్షపడింది. మంగళవారం మరో కేసులో విచారణ నిమిత్తం రోయూన్‌ నుంచి ఎవురెక్స్‌కు జైలు సిబ్బంది కాన్వాయ్‌తో బయల్దేరారు. మార్గం మధ్యలో ఇంక్రావిల్లే వద్ద టోల్‌బూత్‌ దాటుతుండగా.. ఓ నల్ల ఎస్‌యూవీ కారు ఎదురుగా వచ్చి కాన్వాయ్‌ను ఢీకొంది. వెంటనే కొందరు గన్‌మెన్‌లు ఆటోమేటిక్‌ ఆయుధాలతో కాన్వాయ్‌ చుట్టు తిరుగుతూ కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గార్డ్స్‌ చనిపోగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సాయుధులు ‘ది ఫ్లై’ను తీసుకొని రెండు కార్లలో పరారయ్యారు. కొంత దూరంలో ఈ వాహనాలకు నిప్పు పెట్టి వేరే వాటిల్లో వెళ్లిపోయారు. ఈ ఘటన ఫ్రాన్స్‌ను కుదిపేసింది. అధ్యక్షుడు మేక్రాన్‌ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం మొత్తం బాధితుల పక్షాన ఉందన్నారు. ఈ దాడి చేసిన వారిని కచ్చితంగా శిక్షించి తీరతామని అన్నారు. ఫ్రాన్స్‌లో మాదకద్రవ్యాల వినియోగంపై మంగళవారం ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది. డ్రగ్స్‌ సంబంధించిన హింస భవిష్యత్తులో గణనీయంగా పెరిగిపోతుందని దానిలో ఆందోళన వ్యక్తం చేసింది. అదే రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రెండ్రోజల క్రితం కూడా జైల్లో ఊచలు కోసి పరారయ్యేందుకు ‘ది ఫ్లై’ ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు. దాంతో టోల్‌బూత్‌ వద్ద దాడిని ప్లాన్‌ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇతడికి ఫ్రాన్స్‌లోనే అత్యంత శక్తిమంతమైన బ్లాక్స్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మృతి చెందిన యువతికి వరుడు కావలెను !! పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుంది

26 ఏళ్లుగా వ్యక్తి మిస్సింగ్.. పొరుగింట్లోనే బందీగా

భర్త రూ.5ల కుర్‌ కురే తేలేదని విడాకుల వరకూ వెళ్ళిన దంపతులు

ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచిందంతే.. దవడ కాస్తా ??

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ హైవే