RCB vs CSK, IPL 2024: డూ ఆర్ డై మ్యాచ్ లో దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
Royal Challengers Bengaluru vs Chennai Super Kings: ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ప్లే ఆఫ్ ఛాన్స్ ను దృష్టిలో ఉంచుకుని విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే మూడు ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.
Royal Challengers Bengaluru vs Chennai Super Kings: IPL 2024 ప్లేఆఫ్స్‌లో నాల్గవ స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. దీంతో ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ప్లే ఆఫ్ ఛాన్స్ ను దృష్టిలో ఉంచుకుని విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే మూడు ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. అయితే ఆ తర్వాతి నుంచి పిచ్ పై బంతి బాగా టర్న్ అయ్యింది. బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేయడంలో చెన్నై విజయం సాధించింది. అయితే విరాట్ కోహ్లి మాత్రం తన దూకుడును ప్రదర్శించాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. కానీ సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించి డారిల్ మిచెల్‌కి క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన దూకుడును కొనసాగించాడు. 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు రజత్ పాటిదార్ వేసిన ముందు బంతి సాంట్నర్ చేతులకు తగిలి స్టంప్‌లను తాకింది. దీంతో థర్డ్ అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు.
ఆ తర్వాత రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. రజత్ పాటిదార సిక్సర్లు, ఫోర్లు బాది జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అతనికి కామెరాన్ గ్రీన్ కూడా బాగా మద్దతు ఇచ్చాడు. దీనికి తోడు చెన్నై ఆటగాళ్లు క్యాచ్‌ను వదిలేయడంతో ఈ జోడీ సద్వినియోగం చేసుకుంది. రజత్ పటిదార్(41), గ్రీన్ కామెరూన్(38*) దినేశ్ కార్తిక్(14), మ్యాక్స్‌వెల్(16) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ రెండు వికెట్లు తీయగా..శాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలో ఒక వికెట్ తీశారు.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ
ఇంపాక్ట్ ప్లేయర్లు:
శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, ప్రశాంత్ సోలంకి, షేక్ రషీద్, ముఖేష్ చౌదరి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
స్వప్నిల్ సింగ్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్, విజయ్‌కుమార్ వైషాక్, హిమాన్షు శర్మ
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..