Telangana: ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్ సర్కార్..
33జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 17 కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

33జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 17 కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిశ చర్యలు చేపట్టనున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తుంది.
పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలకు 23 కొత్త జిల్లాలుగా మార్చింది గత ప్రభుత్వం. 33 జిల్లాలు ఏర్పాటుతో రాష్ట్ర రూపు రేఖలే మారిపోయాయి. పాత జిల్లాలు ఒక్కో చోట 5 జిల్లాలు విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తెలత్తాయి. పాలన కూడా కొంత ఇబ్బంది మారింది. ఒక ఎంపీ నాలుగు జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులను ఖర్చు చేయడంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాక స్థానిక పరిపాలనలోను అనేక ఇబ్బందులు తలెత్తున్నాయంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. వీటన్నింటిని నిశీతంగా పరిశీలించిన కాంగ్రెస్.. జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టోలో చేర్చంది. కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు PV నరసింహరావు పేరు పెడతామని.. జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్.
దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు పునర్ వ్యవస్థీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈప్రక్రియపై ఫోకస్ చేస్తోంది సర్కార్. దీని కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ కమీషన్‌ను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. కమిటీకి అందించే మార్గదర్శకాల మేరకు జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. జిల్లాల విషయంలో తమ ప్రభుత్వ ఆలోచనను అసెంబ్లీలో ప్రతిపాదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఈ విషయమై ఇతర పార్టీల వైఖరిని తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…