Telangana: బియ్యపు గింజలపై నరసింహుడి నామం.. భక్తిని చాటుకున్న విద్యార్థిని..!
తమ ఇలవేల్పుపై ఉన్న భక్తిని భక్తులు పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరు టెంకాయలు కొడతారు.. మరికొందరు తలనీలాలు సమర్పిస్తారు. ఇంకొందరు ఉపవాసాలు ఉంటారు. కానీ ఓ విద్యార్థిని మాత్రం ఇష్టదైవం లక్ష్మినరసింహుడిపై తన భక్తిని మరో రకంగా చాటుకుంది. బియ్యపు గింజలపై నరసింహుడి నామాలు రాసి తన భక్తిని చాటకున్నారు.
తమ ఇలవేల్పుపై ఉన్న భక్తిని భక్తులు పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరు టెంకాయలు కొడతారు.. మరికొందరు తలనీలాలు సమర్పిస్తారు. ఇంకొందరు ఉపవాసాలు ఉంటారు. కానీ ఓ విద్యార్థిని మాత్రం ఇష్టదైవం లక్ష్మినరసింహుడిపై తన భక్తిని మరో రకంగా చాటుకుంది. బియ్యపు గింజలపై నరసింహుడి నామాలు రాసి తన భక్తిని చాటకున్నారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. ముఖ్యంగా స్వామివారి కల్యాణ తంతును తిలకించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు మట్టపల్లికి వస్తుంటారు. తమ కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరిజిల్లుతున్న మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామి వారి కళ్యాణం ఈనెల 21వ తేదీన జరగనుంది. ఇందుకోసం భక్తులు స్వామి వారికి మొక్కులు, కానుకలు చెల్లించుకుంటారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డికాలనీకి చెందిన విద్యుత్ ఉద్యోగి గుంటూరు శ్రీనివాస్ – శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె గేయవర్షణి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చిన్నతనం నుంచి గేయవర్షణికి ఆధ్యాత్మికత, భక్తి భావం ఎక్కువ. ఈ నెల 21వ తేదీన మట్టపల్లిలో జరిగే లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొనాలని ఈ కుటుంబం భావించింది. దీంతో గేయవర్షణి మండల కాలం (41రోజుల నుండి) మౌన వ్రతంతో పాటు ఉపవాసం ఉంటూ భక్తి పారవశ్యంతో లక్ష్మీ నరసింహుడి నామాన్ని స్మరిస్తూ బియ్యపు గింజలపై స్కెచ్ పెన్నుతో నరసింహుడి నామాన్ని రాసింది. స్వామివారికి సమర్పించేందుకు ఈ ఏడాది జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ నాటి నుంచి బియ్యపు గింజలపై నర్సింహుడి నామాన్ని రాయడం మొదలు పెట్టింది.
ఇప్పటివరకు గేయవర్షణి 27,116 బియ్యపు గింజలపై నర్సీంహుడి నామాలను రాసి తన భక్తినిచాటుకుంది. రోజుకు మూడు గంటల చొప్పున బియ్యపు గింజలపై 108 నామాలను రాయడం మొదలుపెట్టానని, స్వామివారి కల్యాణ తేదీ నాటికి మరో 4వేల బియ్యపు గింజలపై నరసింహుడి నామాన్ని రాసి 31,116 పూర్తి చేస్తానని గేయవర్షణి చెబుతోంది. నరసింహుడు నామాలు రాసిన ఈ బియ్యపు గింజలను స్వామివారి కళ్యాణం రోజున స్వామివారి తలంబ్రాల్లో కలిపేందుకు వేద పండితులకు అందజేస్తానని అంటోంది. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక భావాలతో భగత్ ఆరాధన చేస్తున్న గేయవర్షణిని వేద పండితులు, భక్తులు అభినందిస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..