AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chilled Beer: బీరు రుచి రహస్యం అదేనంట.. అసలు ఫ్రిడ్జ్‌లో ఎందుకు పెడతారో తెలుసా..?

సాధారణంగా చాలా మంది చల్లటి బీర్ తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బీర్ చల్లగా లేకపోతే చేదుగా, మంటగా ఉంటుందని అంటుంటారు. అందుకే ఎక్కువగా చల్లటి ప్రదేశాలు, ఫ్రీడ్జ్‌లో ఉంచిన బీరు తాగడానికే ఆసక్తి చూపిస్తారు. కానీ, బీర్ చల్లగా ఉంచడానికి సైన్స్ కారణం ఉందట..

Chilled Beer: బీరు రుచి రహస్యం అదేనంట.. అసలు ఫ్రిడ్జ్‌లో ఎందుకు పెడతారో తెలుసా..?
Beers
Shaik Madar Saheb
| Edited By: Ram Naramaneni|

Updated on: May 19, 2024 | 7:14 PM

Share

సాధారణంగా చాలా మంది చల్లటి బీర్ తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బీర్ చల్లగా లేకపోతే చేదుగా, మంటగా ఉంటుందని అంటుంటారు. అందుకే ఎక్కువగా చల్లటి ప్రదేశాలు, ఫ్రీడ్జ్‌లో ఉంచిన బీరు తాగడానికే ఆసక్తి చూపిస్తారు. కానీ, బీర్ చల్లగా ఉంచడానికి సైన్స్ కారణం ఉందట. మేటర్ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఇటీవలి పరిశోధనలో చల్లబడిన బీర్ రుచి ఎందుకు రుచిగా ఉంటుందో వివరించారు. పరిశోధకులు నీటి ప్రవర్తనను, ఆల్కహాలిక్ పానీయాలలో ఉండే ఇథనాల్ అణువులను అధ్యయనం చేశారు. చల్లబడిన బీర్ రుచిగా ఉండటానికి గల కారణాన్ని వివరించారు. పరిశోధనలో, నీటి ఉష్ణోగ్రతను బట్టి ఇథనాల్ అణువుల రుచి మారుతున్నట్లు గమనించారు. ది టెలిగ్రాఫ్‌తో పరిశోధన రచయితలలో ఒకరైన ప్రొఫెసర్ లి జియాంగ్ మాట్లాడుతూ.. ‘మా పరిశోధన ఫలితాలు చల్లటి బీర్‌ను ఎక్కువగా ఇష్టపడతారనే ఆలోచనను మరింత బలపరిచాయి. తక్కువ ఉష్ణోగ్రత బీర్ ప్రత్యేక లక్షణాలను మరింత మెరుగుపరుస్తుంది. ఇది చాలా మంది తాగేవారికి మరింత రుచికరంగా ఉంటుంది’ అని అన్నారు.

బీర్‌లో ఉండే నీరు, ఇథనాల్ అణువులను అధ్యయనం చేస్తున్నప్పుడు.. ఇథనాల్ అణువులు వేర్వేరు పానీయాలలో వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద నిర్దిష్ట ఆకారాలను తీసుకుంటాయని పరిశోధకులు తెలిపారు. బీర్ వంటి తక్కువ ఆల్కహాల్ పానీయాలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచినప్పుడు ఇథనాల్ అణువులు పిరమిడ్ ఆకారాన్ని పొందుతాయి. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆల్కహాలిక్ పానీయాల ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉంటే వాటిలోని ఇథనాల్ అణువుల ఆకారం గొలుసులా ఉంటుందని వివరించారు.

“ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు, ఇథనాల్ అణువులు ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. ఇది చల్లటి బీర్ రుచిని మరింత పెంచుతుంది” అని ప్రొఫెసర్ జియాంగ్ చెప్పారు. గొలుసు ఆకారపు అణువుల కంటే పిరమిడ్ ఆకారపు ఇథనాల్ అణువులు మరింత రిఫ్రెష్‌గా ఉన్నాయని అన్నారు. గతంలో బీర్‌పై నిర్వహించిన మరో పరిశోధనలో వాతావరణ మార్పు బీర్‌పై కూడా ప్రభావం చూపుతుందని తేలింది. వాతావరణ మార్పుల వల్ల బీర్ ధర పెరుగుతుందని, దాని రుచి కూడా మారుతుందని సైంటిఫిక్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైన పరిశోధన పేర్కొంది. భూమి ఉష్ణోగ్రత పెరుగడం.. ఇతర కారకాలు బీర్ తయారీలో ఉపయోగించే హాప్ పువ్వుల సంఖ్య, నాణ్యతను తగ్గించగలవు. దీని కారణంగా బీర్ ధర, రుచి రెండూ మారే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..