AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadagirigutta: యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి..

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఏకశిఖరవాసుడు, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే ఆలయ ఈవో తో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్‌ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శ్రీలక్ష్మీ యాదాద్రి నరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు...

Yadagirigutta: యాదగిరిగుట్ట దేవస్థానం కీలక నిర్ణయం.. జూన్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి..
Yadagiri Gutta
M Revan Reddy
| Edited By: Narender Vaitla|

Updated on: May 19, 2024 | 10:07 AM

Share

ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. స్వామి వారి ఆలయంలో వివిధ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఏకశిఖరవాసుడు, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే ఆలయ ఈవో తో పాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్‌ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా శ్రీలక్ష్మీ యాదాద్రి నరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు చేపట్టాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. తాజాగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయాలని దేవస్థానం నిర్ణయించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రిలో భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. స్వామి వారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని, అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్ లో వచ్చే భక్తులకు ఈ నియమం నుండి మినహాయింపు ఇస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆలయంలో జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్ నియమాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంచేందుకే ఇలాంటి నియమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశుడి క్షేత్ర మహత్యం తెలిపేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు, బోర్డులోనే క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేస్తే ఫోన్ లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్షేత్ర మహత్మ్యం వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్ రావు చెబుతున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అమలయ్యే సంప్రదాయ దుస్తుల ధరింపుపై భక్తులందరూ సహకరించాల్సిందిగా ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు