AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. విద్యార్థి లక్ష్యం ఇదే..

తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం గ్రామానికి చెందిన సతివాడ జోతిరాదిత్య తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించాడు. దీనితో ఆదిత్య తల్లిదండ్రులు స్నేహితులతో పాటు జ్యోతిరాదిత్య గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. విద్యార్థి లక్ష్యం ఇదే..
Ts Eapcet
S Srinivasa Rao
| Edited By: |

Updated on: May 19, 2024 | 6:29 AM

Share

తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం గ్రామానికి చెందిన సతివాడ జోతిరాదిత్య తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించాడు. దీనితో ఆదిత్య తల్లిదండ్రులు స్నేహితులతో పాటు జ్యోతిరాదిత్య గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ రావడంతో తల్లిదండ్రులు మోహనరావు, హైమావతి ఆనందంతో కుటుంబ సమేతంగా మిఠాయిలు పంచుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జ్యోతిరాదిత్య మొదటి నుండి ఎంతో చురుగ్గా ఇష్ణంగా చదివేవాడని కృషి పట్టుదలే అతనికి తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‎లో మొదటి ర్యాంక్ సాధించేలా చేసిందని అతని తల్లిదండ్రులు ,గ్రామస్తులు అంటున్నారు.

జ్యోతిరాదిత్య విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. ఇటీవల జరిగిన JEE ప్రిలిమ్స్‎లో 116వ ర్యాంక్ సాధించాడు. JEE మెయిన్స్‎కి ప్రిపేర్ అవుతున్నాడు. శనివారం ఏపీ రాష్ట్ర ఎంసెట్‎ను రాశాడు. IIT లో సీట్ పొందాలన్న లక్ష్యంతో జ్యోతిరాదిత్య ప్రిపేర్ అయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. జ్యోతిరాదిత్య తండ్రి మోహనరావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలోని ఏపీ ప్రభుత్వ మహిళా గురుకుల పాఠశాలలో పనిచేస్తుండగా.. తల్లి హైమావతి శ్రీకాకుళంలో RTC లో కంప్యూటర్ ఆపరేటర్‎గా పని చేస్తున్నారు. వీరి స్వగ్రామం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలం ఎరకారాయపురం కాగా ఉద్యోగరీత్యా వీరి కుటుంబం ప్రస్తుతం శ్రీకాకుళంలో నివాసం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..