పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్ ప్రత్యేక నిఘా..
పల్నాడు జిల్లాలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పర్యటిస్తున్నారు. ఎన్నికల వేళ జరిగిన దాడులపై దర్యాప్తులో వేగం పెంచారు. పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించి వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే అల్లర్లపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రత్యేకంగా సిట్ కమిటీని ఏర్పాటు చేసింది.

పల్నాడు జిల్లాలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు పర్యటిస్తున్నారు. ఎన్నికల వేళ జరిగిన దాడులపై దర్యాప్తులో వేగం పెంచారు. పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించి వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే అల్లర్లపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రత్యేకంగా సిట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు పల్నాడు జిల్లాలో పోలింగే డే, ఆ తర్వాత జరిగిన అల్లర్లపై రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో మాచర్ల నియోజకవర్గం ఒకటి, నర్సరావుపేట నియోజకవర్గం మరొకటిగా గుర్తించారు. రెండు ప్రత్యేక టీంలుగా విడిపోయి వేర్వేరుగా పరిశీలిస్తున్నారు. శనివారం అర్థరాత్రి వరకు విచారణ కొనసాగింది. ఈరోజు కూడా దర్యాప్తు కొనసాగనుంది.
నర్సరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించారు సిట్ అధికారులు. సోషల్ మీడియాలో వచ్చిన విజువల్స్, సిసి కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అల్లర్లలో అరెస్ట్ అయిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను వివరణ అడిగారు. అల్లర్లు, దాడులు జరిగిప్పుడు విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగి మరిన్ని వివరాలు సేకరించారు. మే 19న శుక్రవారం అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి మరిన్ని ఆధారాలు, వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ డే రోజు రెంటాల, తుమృకోట, పాలువాయి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు తమ నివేదిక రూపొందించారు. తుమృకోట, జెట్టి పాలెం పోలింగ్ కేంద్రాల్లోఈవిఎం మెషీన్లు ధ్వంసం అయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు రెంటచింతల పోలీస్ స్టేషన్ పరిధిలో 31 మందిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వీరిపై సిట్ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




