జీటీతో మ్యాచ్‌ రద్దు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2024 విజేతగా కేకేఆర్

14 May 2024

TV9 Telugu

ఈ ఐపీఎల్ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. 13లో 9 విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 

పాయింట్ల పట్టికలో అగ్రస్థానం

కోల్‌కతా నైట్ రైడర్స్ ఖాతాలో మొత్తం 19 పాయింట్లు ఉన్నాయి. నిన్న గుజరాత్‌తో కోల్‌కతా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఛాంపియన్‌గా మారడం ఖాయమైంది. 

ఛాంపియన్‌గా మారడం ఖాయం

మ్యాచ్ రద్దయిన తర్వాత, కోల్‌కతా, గుజరాత్‌లు రెండూ సమానంగా ఒక పాయింట్‌ను పొందాయి. ఈ కారణంగా అయ్యర్ జట్టు లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో కొనసాగాలని నిర్ణయమైంది.

మొదటి రెండు స్థానాల్లో ఉంటే

కోల్‌కతా ఇంకా ఒక మ్యాచ్ ఆడాలి. అంటే గరిష్టంగా 21 పాయింట్లకు చేరుకోవచ్చు. అంటే, చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడినా మొదటి రెండు స్థానాల్లోనే ఉంటారు.

21 పాయింట్లకు చేరే ఛాన్స్

ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ మినహా, మిగిలిన అన్ని మ్యాచ్‌లు గెలిచినప్పటికీ మరే ఇతర జట్టు 19 పాయింట్లను చేరుకోలేదు. ఈ కారణంగా కోల్‌కతా తొలి రెండు స్థానాల్లో నిలవడం ఖాయం. 

 రాజస్థాన్ రాయల్స్ మినహా

రాజస్థాన్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తే, అది లీగ్ దశను అగ్రస్థానంలో ముగిస్తుంది. కోల్‌కతా రెండవ స్థానంలో నిలుస్తుంది. అయితే ఇద్దరూ ఒక క్వాలిఫైయర్ ఆడటం ఖాయం.

క్వాలిఫైయర్ ఆడటం ఖాయం

ఇంతకు ముందు, 2012, 2014 సంవత్సరాల్లో లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో ఉంది. కోల్‌కతా జట్టు ఛాంపియన్‌గా నిలిచిన సంవత్సరం ఇదే. 

2012, 2014 సంవత్సరాల్లో

ఈ లెక్కన చూస్తుంటే, ఐపీఎల్ 2024 విజేతగా కోల్ కతా మారడం ఖాయమైనట్లు తెలుస్తోంది. మరి చరిత్రను రిపీట్ చేస్తారా లేదా చూడాలి.

మరి 2024లో