CM Jagan: లండన్‌లో ల్యాండ్ అయిన జగన్.. ‘ఏమున్నాడ్రా మా అన్న’ అంటున్న ఫ్యాన్స్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం లండన్‌లోని లూటన్‌ చేరుకున్నారు. భద్రతా సిబ్బందితో కలిసి ఉన్న ఆయనను చూసి వైఎస్సార్సీపీ మద్దతుదారులు “జగన్ అన్నా….” అంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్ వారితో కరచాలనం చేసి వారి పేర్లను అడిగాడు.

CM Jagan: లండన్‌లో ల్యాండ్ అయిన జగన్.. 'ఏమున్నాడ్రా మా అన్న' అంటున్న ఫ్యాన్స్

|

Updated on: May 18, 2024 | 4:31 PM

ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి లండన్, స్విట్టర్లాండ్‌, ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో శనివారం లండన్‌కి చేరుకున్నారు. సీఎం జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు సీఎం జగన్‌. జూన్‌ 1న సీఎం జగన్‌ రాష్ట్రానికి వస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow us