ఖరీదైన విల్లా లా లియోపోల్డా గురించి మీకు తెలుసా.?

TV9 Telugu

30 April 2024

విల్లా లా లియోపోల్డా ఒకప్పుడు బెల్జియం రాజు లియోపోల్డ్ II యాజమాన్యంలో ఉన్న ఎస్టేట్‌లో 1929 - 1931 మధ్య నిర్మించబడింది.

లియోపోల్డ్ ఈ ఎస్టేట్‌ను తన సతీమణి బ్లాంచె జెలియా జోసెఫిన్ డెలాక్రోయిక్స్‌కి బహుమతిగా నిర్మించాడని చరిత్ర చెబుతుంది.

దీనిని కరోలిన్ లాక్రోయిక్స్ అని కూడా పిలుస్తారు. లియోపోల్డ్ మరణం తర్వాత  అతని మేనల్లుడు, కింగ్ ఆల్బర్ట్ I, దాని యజమాని అయ్యాడు.

లియోపోల్డ్ సతీమణి బ్లాంచె జెలియా జోసెఫిన్ డెలాక్రోయిక్స్‌ నుంచి ఈ ఎస్టేట్‌ను కింగ్ ఆల్బర్ట్ I బలవంతంగా సొంతం చేసుకున్నాడు.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో విల్లా లా లియోపోల్డా భవనం యుద్ధం చేసే సైనికల కోసం ఆసుపత్రిగా ఉపయోగించబడింది.

1919లో థెరీస్ విటాలి కామ్టెస్సే డి బ్యూచాంప్ ఈ ఆస్తిని స్వాధీనం చేసుకుని దీనిపై సవరణలను ప్రారంభించారు.

ఓగ్డెన్ కాడ్‌మాన్, జూనియర్ ప్రస్తుతం ఉన్న డజను నిర్మాణాలను కొనుగోలు చేశాడు. కొన్నాళ్లకు ఆర్థిక ఇబ్బందులతో సంపన్న అద్దెదారులకు అద్దెకు ఇచ్చాడు.

1951లో కాడ్‌మన్ మరణంతో, ఎస్టేట్‌ను ఇజాక్ వాల్టన్ కిల్లమ్‌కు విక్రయించారు, అతని మరణం తర్వాత అతని భార్య ఆ స్థలాన్ని వారసత్వంగా పొందింది.

1950ల తర్వాతి కాలంలో ఆమె దానిని ఫియట్ ప్రెసిడెంట్ జియాని అగ్నెల్లి, మారెల్లా అగ్నెల్లికి విక్రయించింది.