Lifestyle: ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ

రక్తపోటు లేని వారితో పోల్చితే రక్తపోటు ఉన్న వారు పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం లేదా గుండె శస్త్రచికిత్సకు గురయ్యే ప్రమాదం రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు దాని ప్రమాదాలను తగ్గించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడానికి...

Lifestyle: ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
Kids
Follow us

| Edited By: Phani CH

Updated on: May 06, 2024 | 10:33 PM

బాల్యంలో అధిక రక్తపోటు వచ్చిన చిన్నారుల్లో స్ట్రోక్, గుండెపోటు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. కెనడాలోని అంటారియోలో 1996 నుంచి 2021 మధ్య అధిక రక్తపోటు సమస్య ఉన్న 25,605 మంది పిల్లలు, కౌమారదశలో ఉన్న వారిని పరిగణలోకి తీసుకొని ఈ పరిశోధనలు నిర్వహించారు.

రక్తపోటు లేని వారితో పోల్చితే రక్తపోటు ఉన్న వారు పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం లేదా గుండె శస్త్రచికిత్సకు గురయ్యే ప్రమాదం రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటు దాని ప్రమాదాలను తగ్గించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అధిక రక్తపోటును నియంత్రించడానికి, చిన్న వయస్సులోనే దాని ప్రమాదాలను తగ్గించడానికి ప్రజల్లో అవగాహన కల్పించాలని పరిశోధకులు చెబుతున్నారు.

చిన్నారుల్లో దీర్ఘకాలంగా తలనొప్పి సమస్య వేధించడం, అలసట, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఇక చిన్నారుల్లో రక్తపోటు రావడానికి కారణాల్లో ఊబకాయం, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబంలో బీపీ వచ్చిన వారు ఉండడం, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో బీపీని తగ్గించడానికి మంచి ఆహారాన్ని అందించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం అలవాటు చేయాలి. పిల్లలను స్మార్ట్‌ ఫోన్‌ల నుంచి వీలైనంత వరకు దూరంగా ఉంచాలి.

Latest Articles