కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..

కొవిడ్‌ .. రెండున్నరేళ్లు యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. దాదాపు అన్ని రంగాలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం ఉరుకులు పరుగులెత్తే మానవాళిని ఇంటికే పరిమితం చేసింది. వర్క్‌ ఫ్రం హోం సంస్కృతిని అలవాటు చేసింది. కార్పొరేట్‌ సంస్థలు కూడా దీనిని ప్రోత్సహించాయి. ఇప్పడు అదే వారికి తలనొప్పిగా మారింది. కొవిడ్‌ వచ్చి నాలుగేళ్లు పూర్తయినా ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడటం లేదు.

కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..

|

Updated on: May 06, 2024 | 10:34 PM

కొవిడ్‌ .. రెండున్నరేళ్లు యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించింది. దాదాపు అన్ని రంగాలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడింది. నిత్యం ఉరుకులు పరుగులెత్తే మానవాళిని ఇంటికే పరిమితం చేసింది. వర్క్‌ ఫ్రం హోం సంస్కృతిని అలవాటు చేసింది. కార్పొరేట్‌ సంస్థలు కూడా దీనిని ప్రోత్సహించాయి. ఇప్పడు అదే వారికి తలనొప్పిగా మారింది. కొవిడ్‌ వచ్చి నాలుగేళ్లు పూర్తయినా ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ఇష్టపడటం లేదు. దాంతో ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించడానికి కొత్త కొత్త ప్లాన్స్‌ వేస్తున్నాయి కార్పొరేట్‌ సంస్థలు. అందులోంచి వచ్చిందే మరో కొత్త ట్రెండ్‌ ఆఫీస్‌ పీకాకింగ్‌. అంటే ఆఫీసులో ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం. వారు ఉత్సాహంగా పనిచేయడానికి ఆహ్లాదకర వాతావరణం కల్పించి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ఆఫీసులో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఆఫీస్‌ను అందంగా అలంకరించడం, కిచెన్లు, ఆకట్టుకునే సోఫాలు, ఫర్నిచర్‌ను, లైటింగ్‌ను ఏర్పాటుచేస్తున్నాయి. వీటిని ఎరగా చూపి ఉద్యోగుల్ని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??

Kalki 2898 AD: కల్కి నుంచి ఫస్ట్ సింగిల్‌ వస్తోందోచ్‌.. ఎప్పుడంటే ??

Vishal: టాప్ పొలిటీషియన్ బయోపిక్‌లో విశాల్‌ హీరో !!

ఆ టాప్ హీరో చెల్లిగా అంటే నయన్‌ ఒప్పుకుంటారా ?? ఇంతకీ ఆ హీరో ఎవరంటే ??

Vishwambhara: 18 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ అంటే మాటలు కాదు మరి

Follow us
Latest Articles