Google: రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

Google: రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

Anil kumar poka

|

Updated on: May 06, 2024 | 11:38 AM

టెక్‌ దిగ్గజం, ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో పైథాన్‌ టీమ్‌ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్‌ తాజాగా మరో 200 మందిపై వేటువేసింది. వీరంతా కోర్ టీమ్‌లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగులు లభిస్తుండటంతో ఈ పొజిషన్లను భారత్‌, మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు సమాచారం.

టెక్‌ దిగ్గజం, ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో పైథాన్‌ టీమ్‌ మొత్తాన్ని ఎత్తేసిన గూగుల్‌ తాజాగా మరో 200 మందిపై వేటువేసింది. వీరంతా కోర్ టీమ్‌లో సభ్యులని, గత నెల 25కు ముందే వీరందరిని తొలగించినట్లు ఓ నివేదిక పేర్కొంది. అమెరికా వెలుపల చౌకగా ఉద్యోగులు లభిస్తుండటంతో ఈ పొజిషన్లను భారత్‌, మెక్సికోకు బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఇండియా, మెక్సికోలోనూ కొందరు ఉద్యోగులను ఇంటికి పంపేందుకు గూగుల్ సిద్ధమైనట్టు సీఎన్‌బీసీ నివేదించింది. గూగుల్ ఇటీవలే తమ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీం ఉద్యోగులను తొలగించింది. అది జరిగిన రెండు రోజులకే ఇప్పుడు మరో 200 మందిని ఇంటికి పంపంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కనీసం 50 మంది కాలిఫోర్నియా సన్నీవేల్‌ కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలోని వారే. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి గూగుల్ డెవలపర్ ఎకోసిస్టం వైస్ ప్రెసిడెంట్ ఆసిం హుస్సేన్ ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.