Horoscope Today: ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే.. మంగళవారం రాశిఫలాలు ఇలా..
దిన ఫలాలు (మే 7, 2024): మేష రాశి వారికి ఈ రోజు అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేయవలసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (మే 7, 2024): మేష రాశి వారికి ఈ రోజు అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేయవలసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది.. ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబంతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి సమస్య పరి ష్కార మయ్యే అవకాశముంది. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగు తుంది. ఇప్పట్లో ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొన్ని ఆస్తి వివాదంలో టెన్షన్ లు కొద్దిగా తగ్గుతాయి. కుటుంబ పరిస్థితులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలతో వ్యవహారాలు పూర్తి అవు తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేయవలసి వస్తుంది. ఆరోగ్యం బాగా బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరి ష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించిన అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం బాగుం టుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడడం ప్రారంభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు కూడా అభివృద్ధి బాట పడతాయి. ఎక్కువగా శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరు గుతుంది. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయానికి లోటుండదు. వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి అవుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ లభించే అవకాశముంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి, ఇతరులకు అండగా నిలబడడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కొన్ని సమ స్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థి కంగా కొన్ని ముఖ్యమైన అనుకూలతలు కలుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వ్యక్తిగత సమ స్యల ఒత్తిడి తగ్గుతుంది. మిత్రులతో విలాస జీవితం గడుపుతారు. కుటుంబ పరిస్థితి బాగా అను కూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి స్థిరంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండే అవకాశముంది. ఇతరుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ ఉంటుంది. సర్వత్రా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వ్యవహ రించడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశముంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పెండింగు పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రస్తుతానికి సమయం బాగా అను కూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు సాను కూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. కొందరు దగ్గర బంధువులతో అపా ర్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరిగే అవకాశముంది. కొందరు బంధువులు, సన్నిహితులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు లాభదా యకంగా పురోగతి చెందుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
గృహ, వాహన సౌకర్యాలకు అనుకూల వాతావరణం ఉంది. కొందరు బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పెండింగు పనులన్నీ పూర్తవుతాయి. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల వల్ల కొద్దిగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది.