Financial Progress: లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
జ్యోతిష శాస్త్రంలో లాభ స్థానాధిపతిని, లాభస్థానాన్ని బట్టి పురోగతిని నిర్ణయించడం జరుగుతుంది. గ్రహ సంచారంలో ఈ గ్రహాలు లాభ స్థానంలో, అంటే 11వ స్థానంలో ఉన్నాయన్న దానిని పరిశీలించి ప్రోగ్రెస్ గురించి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశులకు శీఘ్ర పురోగతికి అవకాశముంది.
జ్యోతిష శాస్త్రంలో లాభ స్థానాధిపతిని, లాభస్థానాన్ని బట్టి పురోగతిని నిర్ణయించడం జరుగుతుంది. గ్రహ సంచారంలో ఈ గ్రహాలు లాభ స్థానంలో, అంటే 11వ స్థానంలో ఉన్నాయన్న దానిని పరిశీలించి ప్రోగ్రెస్ గురించి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశులకు శీఘ్ర పురోగతికి అవకాశముంది. జూన్ 1వ తేదీ లోపల ఈ రాశుల వారు అనుకున్నది సాధించడం, పురోగతి చెందడం, మనసులోని కోరికలు నెరవేరడం, మంచి పరిచయాలు ఏర్పడడం వంటివి తప్పకుండా జరిగే అవకాశముంటుంది.
- మేషం: ఈ రాశికి లాభ స్థానంలో స్వస్థానంలో శని సంచారం చేస్తున్నందువల్ల శీఘ్ర పురోగతి (క్విక్ ప్రోగ్రెస్) కాకపోయినా నిలకడగా పురోగతి చెందడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి క్రమంగా బయటపడి, బాగా నిలదొక్కుకుని, స్థిరపడడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు క్రమంగా వెలుగులోకి వస్తాయి. తప్పకుండా పదోన్నతి లభించే అవకాశముంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, రాహువుల సంచారం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. ప్రతిభా పాటవాలను నిరూపించుకుని పదోన్నతులు సంపాదించడం గానీ, వీలైతే అడ్డ దోవల్లో పదోన్నతులు సంపాదించడం గానీ జరుగుతుంది. ఆదాయపరంగా, సంపద పరంగా విశేష మైన అభివృద్ధి ఉంటుంది. అన్ని రకాల వారితోనూ లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. అనారోగ్యాల నుంచి కోలుకోవడం కూడా జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, రవుల సంచారం వల్ల వీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ శీఘ్ర పురోగతి సాధ్యమవుతుంది. ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. ఈ రాశివారికి స్త్రీ మూలక ధన లాభానికి కూడా అవకాశముంది. ఉద్యోగంలో పనితీరుతో, శక్తిసామర్థ్యాలతో అధికారులను ఆకట్టుకోవడం వల్ల అతి త్వరగా పదోన్నతులు సంపాదించడం, జీతభత్యాలు పెంచుకోవడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు. చదువుల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ఆర్థికంగా ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
- వృశ్చికం: ఈ రాశికి లాభస్థానంలో కేతువు ఉండడంతో పాటు, ఆ గ్రహాన్ని గురువు కూడా వీక్షిస్తున్నందు వల్ల తప్పకుండా ఈ రాశివారికి శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు, అధికారాలు పెరగడంతో పాటు ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. అతి తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు పొందుతారు. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. కొత్త రకం జీవితం అలవడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు బాగా కలిసి వస్తాయి.
- మకరం: ఈ రాశికి లాభస్థానాన్ని రాశ్యధిపతి శనీశ్వరుడు, పంచమ స్థానం నుంచి గురువు వీక్షిస్తున్నందు వల్ల అనేక విధాలుగా ధన యోగం కలిగే అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్య భంగం ఉండదు. నిదానంగా ప్రయత్నాలు సఫలం కావడం, నిదానంగా పురోగతి చెందడం, మనసులోని కోరికలు నెరవేరడం జరుగుతుంది.