Akhanda Yoga: అరుదైన వరుస క్రమంలో గ్రహాలు.. ఆ రాశుల వారికి అఖండ యోగం పట్టనుంది..!
ఈ నెల 10వ తేదీ వరకు, ఒక్క కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ కుంభ రాశి నుంచి వృషభ రాశి వరకూ విస్తరించి ఉంటాయి. అంటే మొత్తం గ్రహాలన్నీ జాతక చక్రం పైవరుసలో, కేవలం నాలుగు రాశులకే పరిమితం అవుతాయి. ఈ విధమైన గ్రహాల పరిస్థితి మంచి యోగాలనిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో దీన్ని అఖండ సామ్రాజ్య యోగం అంటారు. ఈ రోజుల్లో సామ్రాజ్యాలకు అవకాశం లేనందువల్ల, వృత్తి, వ్యాపారాలను విస్తరించుకోవడం,
వచ్చే కొన్ని రోజుల పాటు ఒక్క కేతువు మినహా మిగిలిన గ్రహాలన్నీ కుంభ రాశి నుంచి వృషభ రాశి వరకూ విస్తరించి ఉంటాయి. అంటే మొత్తం గ్రహాలన్నీ జాతక చక్రం పైవరుసలో, కేవలం నాలుగు రాశులకే పరిమితం అవుతాయి. ఈ విధమైన గ్రహాల పరిస్థితి మంచి యోగాలనిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో దీన్ని అఖండ సామ్రాజ్య యోగం అంటారు. ఈ రోజుల్లో సామ్రాజ్యాలకు అవకాశం లేనందువల్ల, వృత్తి, వ్యాపారాలను విస్తరించుకోవడం, ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం, అధికార పరిధి పెరగడం, ఆదాయం బాగా వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ఈ రకమైన గ్రహ స్థితిగతుల వల్ల మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశులు బాగా లబ్ధి పొందడం జరుగుతుంది.
- మిథునం: ఈ రాశికి ప్రస్తుతం ప్రతి గ్రహమూ అనుకూలంగా ఉంది. దీనివల్ల ఉద్యోగంలో అధికార పరిధి పెరుగుతుంది. పనిచేస్తున్న కంపెనీ సంబంధించిన బ్రాంచీల బాధ్యతలను కూడా నిర్వర్తించవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడం వల్ల వాటిని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాలకు ఇది బాగా అనుకూల సమయం. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందు తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఇంటికి కొత్త సౌకర్యాలు అమర్చుకుంటారు.
- కర్కాటకం: ఈ రాశికి మీన, మేష, వృషభ రాశుల్లోని గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పెండింగు వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. ఆగిపోయిన శుభ కార్యాలు ఇప్పుడు పూర్తయ్యే అవకాశముంది. పెండింగులో ఉన్న పదోన్నతులు ఇప్పుడు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విదేశీ యానానికి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరమైన జీవితం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఊపందుకుంటాయి.
- సింహం: ఈ రాశికి కుంభ రాశి నుంచి వృషభ రాశి వరకూ గ్రహాలన్నీ అనుకూల సంచారం చేస్తున్నందు వల్ల పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అప్రయత్న ధన లాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మరింతగా కలిసి వస్తుంది. పదోన్నతులకు, జీత భత్యాలు పెరగడానికి అవకాశముంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా కనిపిస్తోంది.
- తుల: ఈ రాశికి అయిదవ స్థానం నుంచి ఎనిమిదవ స్థానం వరకూ గ్రహాలు అనుకూలంగా ఉన్నందు వల్ల వృత్తి, వ్యాపారాలను విస్తరించుకోవడానికి మార్గాలు సుగమం అవుతాయి. ఉద్యోగంలో అధికార పరిధి పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే తప్ప తరిగే అవకాశం ఉండదు. ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి. ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశాలు మెరుగుపడతాయి.
- వృశ్చికం: ఈ రాశివారికి నాలుగవ స్థానం నుంచి సప్తమ స్థానం వరకూ గ్రహాలన్నీ సంచరిస్తున్నందువల్ల, గృహ పరిధిని విస్తరించుకోవడం లేదా ఇంట్లో సౌకర్యాలను పెంచుకోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వాహనాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా విస్తరించే అవకాశముంది. ఉద్యోగంలో అధికార పరిధి పెరుగుతుంది. బాధ్యతలు కూడా బాగా పెరిగే సూచనలున్నాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.
- మకరం: ఈ రాశికి ధన స్థానం నుంచి పంచమ స్థానం వరకు గ్రహాలు సంచారం చేయడం వల్ల తప్పకుండా అఖండ సామ్రాజ్య యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఏదైనా కంపెనీకి అధిపతి అయ్యే అవ కాశం ఉంటుంది. ఉద్యోగంలో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.