Pariharas: కీలక గ్రహాల సంచార దుష్ప్రభావం.. ఈ పరిహారాలు చేస్తే ఆ రాశుల వారికి ప్రత్యేక యోగాలు తథ్యం..!
Telugu Astrology: ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న కుజ, రాహువులు, మేష రాశిలో సంచరిస్తున్న శుక్ర, రవుల వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా దుష్ఫలితాలు అనుభవించే అవకాశం ఉంది. వీటి వల్ల ముఖ్యమైన పనులు ఆగిపోవడం, ప్రమాదాలు జరగడం, అపనిందలు పడడం, ధన లాభాలకు గండి పడడం, పదోన్నతులకు ఆటంకాలు ఏర్పడడం, కుటుంబంలో చిక్కులు తలెత్తడం వంటివి జరుగుతాయి.
ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న కుజ, రాహువులు, మేష రాశిలో సంచరిస్తున్న శుక్ర, రవుల వల్ల కొన్ని రాశుల వారు తప్పకుండా దుష్ఫలితాలు అనుభవించే అవకాశం ఉంది. వీటి వల్ల ముఖ్యమైన పనులు ఆగిపోవడం, ప్రమాదాలు జరగడం, అపనిందలు పడడం, ధన లాభాలకు గండి పడడం, పదోన్నతులకు ఆటంకాలు ఏర్పడడం, కుటుంబంలో చిక్కులు తలెత్తడం వంటివి జరుగుతాయి. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు బాగా ఇబ్బంది పడే అవకాశముంది. ఈ కష్టనష్టాల నుంచి బయటపడి శుభ ఫలితాలను అనుభవించడానికి కొద్దిపాటి పరిహారాలు పాటించడం చాలా అవసరం.
- మేషం: ఈ రాశిలో శుక్ర, రవుల సంచారం వల్ల పదోన్నతులకు, ఆదాయ వృద్ధికి ఏమాత్రం లోటు లేనప్పటికీ, జీవిత భాగస్వామితో తీవ్రస్థాయి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇద్దరి మధ్యా అఘాదం పెరిగే సూచనలున్నాయి. దీనికి తోడు, రాశ్యధిపతి కుజుడు వ్యయ స్థానంలో రాహువుతో కలవడం వల్ల విదేశీ అవకాశాలు పెరిగే సూచనలున్నప్పటికీ, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వీటి నుంచి బయటపడడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ, రాహువుల కలవడం వల్ల ఈ రాశివారికి అనారోగ్యాలు, అవమా నాలు, నిరాశానిస్పృహలు, నిస్సత్తువలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. సంపద పెరగడానికి ఇవి దోహదం చేస్తున్నప్పటికీ, అష్టమ స్థానంలో కుజ, రాహువులు కలవడమన్నది ఆయుర్దాయానికి కూడా మంచిది కాదు. ఒక నెల రోజుల పాటు దుర్గా స్తోత్రం చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
- కన్య: ఈ రాశికి సప్తమంలో కుజ, రాహులు, అష్టమ స్థానంలో రవి, శుక్రులు కలిసి ఉండడం దాంపత్య జీవితానికి, కుటుంబ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు. వీటి వల్ల ఉద్యోగాల్లో పదోన్నతులు పెరగడం, వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోవడం వంటి శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి కానీ కుటుంబ జీవితం మాత్రం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ దోషాల నుంచి బయటపడి ఆనం దంగా ఉండాలన్న పక్షంలో విష్ణు సహస్రనామాన్ని వీలైనన్నిసార్లు పారాయణం చేయడం ఉత్తమం.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ, రాహువుల వంటి పాప గ్రహాలు కలవడం సుఖ నాశనానికి దారి తీస్తుంది. ఈ గ్రహాల కలయిక ఉద్యోగంలో హోదా పెరగడానికి, ప్రతిభా పాటవాలు వెలుగులోకి రావడానికి అవకాశమిస్తాయి. కానీ, కుటుంబంలో సుఖ సంతోషాలను బాగా తగ్గిస్తుంది. ఒక్కసా రిగా కుటుంబ సమస్యలు పెరిగిపోతాయి. ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అయ్యే ప్రమాదముం టుంది. ఆంజనేయ స్వామి, నరసింహస్వామి స్తోత్రాల పారాయణ వల్ల ఈ దోషాలు మాయమవుతాయి.
- కుంభం: ఈ రాశికి ధన, కుటుంబ స్థానంలో కుజ, రాహువుల సంచారం వల్ల ఎక్కువగా ధన నష్టం జర గడంతో పాటు, కుటుంబ సమస్యలు విజృంభించే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో మాటకు విలువ పెరు గుతుంది. కుటుంబంలో మాత్రం అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికంగా మోసపోవడం, నష్టపో వడం జరుగుతుంది. లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ చేయడం వల్ల ఈ పరిస్థితులు తారుమారవుతాయి.
- మీనం: ఈ రాశిలో కుజ, రాహువుల సంచారం, ధన స్థానంలో శుక్ర, రవుల సంచారం వృత్తి, ఉద్యోగాల పరంగా, సామాజిక హోదా పరంగా, మంచి పరిచయాలపరంగా యోగదాయకమే కానీ, కష్టార్జితం బాగా వృథా అయ్యే అవకాశముంటుంది. బాగా సన్నిహితులు మోసం చేయడం జరుగుతుంది. కుటుంబంలో అకారణంగా విభేదాలు, వివాదాలు తలెత్తుతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితానికి భంగం కలుగుతుంది. లలితా సహస్ర నామం పారాయణం చేయడం వల్ల వీటి నుంచి విముక్తి లభిస్తుంది.