AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Gochar 2024: వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. ! అందులో మీ రాశి ఉందా..?

గురువు 12 ఏళ్లకొకసారి రాశి మారడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ ఏడాది వృషభంలో సంచరించడం జరుగుతుంది. వృషభ రాశి జాతక చక్రంలో రెండవ స్థానం అవుతుంది. రెండవ స్థానమంటే కుటుంబం, వాక్కు, ధనానికి సంబంధించినది. అంటే, వృషభ రాశి సహజమైన కుటుంబ, ధన స్థానమన్నమాట. ఈ రాశిలో ధన కారకుడైన గురువు సంచరించడం వల్ల కుటుంబ వృద్ధి, ధన, ధాన్య వృద్ధికి అవకాశముంటుంది.

Guru Gochar 2024: వృషభ రాశిలో గురువు సంచారం.. ఈ రాశుల వారికి అరుదైన యోగాలు.. ! అందులో మీ రాశి ఉందా..?
Guru Gochar 2024
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: May 06, 2024 | 1:45 PM

Share

గురువు 12 ఏళ్లకొకసారి రాశి మారడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ ఏడాది వృషభంలో సంచరించడం జరుగుతుంది. వృషభ రాశి జాతక చక్రంలో రెండవ స్థానం అవుతుంది. రెండవ స్థానమంటే కుటుంబం, వాక్కు, ధనానికి సంబంధించినది. అంటే, వృషభ రాశి సహజమైన కుటుంబ, ధన స్థానమన్నమాట. ఈ రాశిలో ధన కారకుడైన గురువు సంచరించడం వల్ల కుటుంబ వృద్ధి, ధన, ధాన్య వృద్ధికి అవకాశముంటుంది. ప్రస్తుతం ఈ గురు గ్రహ సంచారం వల్ల మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశివారికి ఈ అరుదైన యోగం పడుతోంది.

  1. మేషం: ఈ రాశికి కుటుంబ, ధన స్థానమైన వృషభ రాశిలో గురువు సంచారం వల్ల కుటుంబ వృద్ధికి అవకాశముంటుంది. కుటుంబ సభ్యులు ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశముంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ముఖ్యమైన శుభ కార్యాలు జరుగుతాయి. అనేక శుభ వార్తలు వింటారు.
  2. వృషభం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల ధన వ్యామోహం బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధి కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడతారు. ప్రతిభా పాటవాలను, నైపుణ్యాలను పెంచుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. మధ్యవర్తిత్వాల ద్వారా, బ్రోకరేజీల ద్వారా ధన సంపాదనకు అవకాశముంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ లో రాణిస్తారు. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల లాభం ఉంటే తప్ప ఏ పనీ చేయని తత్వం ఏర్పడు తుంది. లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. భూ సంబంధమైన ఆస్తుల క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో అదనపు రాబడికి బాగా అవకాశముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశముంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో గురు సంచారం వల్ల ఆస్తిపాస్తులను పెంచుకోవడం మీదా, బ్యాంక్ బ్యాలెన్స్ ను వృద్ది చేసుకోవడం మీదా దృష్టి కేంద్రీకరిస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవు తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుని, పొదుపు సూత్రాలను పాటిస్తారు. కుటుంబపరంగా కూడా ఆశించిన స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి బాగా అవకాశముంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి ధన సంపాదన మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. సప్తమ స్థానం నుంచి ఈ రాశిని వీక్షిస్తున్న గురువు వల్ల అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంటుంది. కొందరు మిత్రు లతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలున్నాయి. రాజీమార్గంలో సోదర వర్గంతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. పొదుపు, మదుపుల్ని లక్ష్యంగా చేసుకుంటారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారులు బాగా లాభాలు గడి స్తారు.
  6. మకరం: ఈ రాశివారికి పంచమ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచారం వల్ల ధన సంపాదనే లక్ష్యంగా మారుతుంది. కుటుంబ వృద్ధికి అవకాశముంది. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ బాగా రాణి స్తారు. సంతాన యోగానికి అవకాశముంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సత్ఫలితాలని స్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. జీతభత్యాలు పెరగడం, లాభాలు, రాబడి వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.