Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలకు ఆస్కారముంది. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలకు ఆస్కారముంది. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ధన సంబంధమైన వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగు లకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.ఆర్థికంగా గతం కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఊరట చెందుతారు. సమాజంలో ప్రముఖు లతో పరిచయాలు విస్తరిస్తాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలు వైన వస్తు పరికరాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు ఆశించిన స్థాయిలో సాగిపోతాయి. కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతలు ఉంటాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. కాస్తంత ఆచితూచి వ్యవహరించడం ఉత్త మం. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలకు బ్రేక్ పడుతుంది. ఆస్తి వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. చిన్నా చితకా సమస్యలను అధిగమిస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని వివాదాలు కలుగు తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
రోజంతా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు చోటు చేసు కుంటాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉండవచ్చు. వ్యాపారాలు లాభ సాటిగా సాగిపోతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు ఆశించిన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం అన్ని విధాలు గానూ అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కాస్తంత శ్రద్ధ తీసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణ యాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలకు ఆస్కారముంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెడతాయి. ఆస్తి వివాదం వాయిదా పడే అవకాశముంది. మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆరోగ్యం చాలా వరకు పరవాలేదు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనేక విధాలుగా సమయం మీకు అనుకూలంగా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఆలోచనలు సాగిస్తారు. ఇతరుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అవసరానికి మించి డబ్బు అందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యో గాల్లో బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ముఖ్యమైన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు బాగా విస్త రిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయవంతంగా పూర్తవుతాయి. శుభ కార్యాల్లో ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగిపో తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశముంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ వల్ల ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా లాభాలకు కొరత ఉండదు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహా రాలు పూర్తవుతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సోదరులతో వివా దాలు పరిష్కారమవుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితుల బాగా అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అనుకూలమవుతారు. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందు తుంది. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి పోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబ డులకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబపరమైన నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఘన విజయాలు సాధి స్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో చిన్నా చితకా సమస్యల నుంచి బయటపడతారు. అధికారులకు సహాయంగా ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మరిన్ని రాశి ఫలాల సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..