AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. ఆ డబ్బును డిపాజిట్ చేద్దామని వెళ్లగా దిమ్మతిరిగింది!

ప్రేమలో పడ్డవారు బహుమతులు ఇచ్చుకోవడం సర్వసాధారణమే. ఎవరి స్తోమతను బట్టి వారు తమ ప్రేయసికి గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. డబ్బున్న వారు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. ఇక మధ్యతరగతి వారు తమకు తోచిన విధంగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. అయితే తాజాగా ఓ ప్రియుడు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. ఆ డబ్బును డిపాజిట్ చేద్దామని వెళ్లగా దిమ్మతిరిగింది!
Trending
Ravi Kiran
|

Updated on: May 06, 2024 | 3:40 PM

Share

ప్రేమలో పడ్డవారు బహుమతులు ఇచ్చుకోవడం సర్వసాధారణమే. ఎవరి స్తోమతను బట్టి వారు తమ ప్రేయసికి గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. డబ్బున్న వారు ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. ఇక మధ్యతరగతి వారు తమకు తోచిన విధంగా ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. అయితే తాజాగా ఓ ప్రియుడు చేసిన పనికి ప్రియురాలు అవాక్కయింది. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెకు ఫ్లాట్ కొనివ్వాలని ప్రియురాలి పేరెంట్స్ కండీషన్ పెట్టడంతో ఆ యువకుడు ఓ ఐడియా వేశాడు. కానీ అది కాస్తా బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు.

చైనాలో ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు చివరికి వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేశారు. అయితే వారి ప్రేమను అంగీకరించిన ప్రియురాలి తల్లిదండ్రులు.. ప్రియుడికి ఓ కండిషన్‌ పెట్టారు. పెళ్లికి ముందే తమ కుమార్తె పేరు మీద ఒక ఫ్లాట్ కొనాలని అతడికి సూచించారు. అలా అయితేనే తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తామని వారు చెప్పారు. అయితే ఫ్లాట్ కొనేందుకు ఆ వ్యక్తి వద్ద డబ్బులు లేకపోవడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తన ప్రియురాలికి మాత్రం భారీ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. చివరికి ఆ యువకుడు ఒక ప్లాన్ చేశాడు. మొత్తం రూ.80 లక్షలు ఓ సూట్‌ కేసులో సర్దేశాడు. వాటిని తీసుకెళ్లి.. తన లవర్‌కు ఇచ్చాడు. దీంతో ఆమె ఎంతో సంతోషంగా తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వాటిని బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లారు. క్యాష్ కౌంటర్‌కు వెళ్లి ఆ డబ్బులను చూపించగా.. నకిలీవని బ్యాంకు అధికారులు తేల్చారు. పైన కొన్ని నిజమైన నోట్లను పెట్టి లోపల అన్నీ నకిలీ నోట్లు పెట్టినట్టు గుర్తించారు. దీంతో తన లవర్ చేసిన అసలు బండారం బయటపడింది. ఈ సంఘటనతో ప్రేయసితోపాటు ఆమె తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు. నకిలీ నోట్లు పెట్టి మోసం చేయడంతో పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఇక న‌కిలీ క‌రెన్సీని క‌లిగి ఉన్నందుకు ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో త‌న నేరాన్ని అంగీక‌రించిన స‌ద‌రు వ్యక్తి.. గ‌ర్ల్‌ఫ్రెండ్ పేరెంట్స్ పెట్టిన కండిష‌న్‌ను తీర్చడానికి త‌నవ‌ద్ద అంత భారీ మొత్తం లేక‌ పోవ‌డంతో ఇలా ఫేక్ క‌రెన్సీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన‌ట్లు వెల్లడించాడు.(Source)