Viral: 42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఫ్రీగా ఇచ్చేస్తున్నారోచ్.. త్వరపడండి మరి.!

ప్రభుత్వం పిలిచి మరీ ఓ పెద్ద విల్లాను ఫ్రీగా ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.. ఎగిరి గంతేసి మరీ దానిని దక్కించుకోడానికి క్యూలు కడతారు కదా. కానీ జర్మనీలో 47 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ అతిపెద్ద విల్లాను ఉచితంగా ఇస్తాం..కావాలనుకున్నవారు తీసుకోవచ్చంటూ..

Viral: 42 ఎకరాల్లో అతిపెద్ద విల్లా.. ఫ్రీగా ఇచ్చేస్తున్నారోచ్.. త్వరపడండి మరి.!
Viral News
Follow us

|

Updated on: May 06, 2024 | 4:30 PM

ప్రభుత్వం పిలిచి మరీ ఓ పెద్ద విల్లాను ఫ్రీగా ఇస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.. ఎగిరి గంతేసి మరీ దానిని దక్కించుకోడానికి క్యూలు కడతారు కదా. కానీ జర్మనీలో 47 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ అతిపెద్ద విల్లాను ఉచితంగా ఇస్తాం..కావాలనుకున్నవారు తీసుకోవచ్చంటూ జర్మన్‌ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఆఫర్‌ ఇచ్చింది. అవును మరి పెద్ద పెద్ద భవనాలను కట్టేయగానే సరిపోతుందా.. వాటిని మెయింటెయిన్‌ చెయ్యాలిగా.. అదే ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దాంతో ఆ విల్లాను ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేద్దామని డిసైడ్‌ అయింది.

జర్మన్‌ నియంత హిట్లర్ పేరు వింటేనే ఒకప్పుడు ప్రపంచం వణికిపోయింది. ఆయన అత్యంత సన్నిహితుల్లో జోసెఫ్ గోబెల్స్‌ ఒకరు. ఆయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడు. వార్తా పత్రికలు, రేడియో, సినిమా మాధ్యమాలను ఉపయోగించుకొని నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న ఆ విల్లా ఈయనదే. 1936లో దానిని నిర్మించారు. గోబెల్స్ దీనిని అనేక అవసరాలకు వినియోగించారని, అక్కడ పలువురు నటీమణులతో సంబంధాలు నడిపారని పలు కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భవంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, నాజీ పాలనతో ముడిపడిన చరిత్ర వంటి కారణాలతో దానిని వదిలించుకోవాలని చూస్తోంది. ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే.. ప్రభుత్వం దానిని బహుమతిగా అందజేస్తుంది అని ఆ దేశ ఆర్థిక మంత్రి స్టెఫాన్‌ ఎవర్స్‌ వెల్లడించారు. 2000 సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ నివసించడం లేదు. ప్రస్తుతం అది రోజురోజుకూ శిధిలావస్థకు చేరుతోంది. దానిని సొంతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తగిన ప్రతిపాదన లేకపోతే.. ప్రభుత్వం దానిని కూల్చివేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Latest Articles
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
ఈసీ సీరియస్ యాక్షన్.. అధికారుల్లో టెన్షన్.. సస్పెన్షన్ల వేటుతో..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!