Chicken Curry: దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సిందే!

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌కి ఫ్యాన్స్ ఎక్కువే. చికెన్ కర్రీ ఎలాంటి పుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసినా.. చాలా రుచిగా ఉంటుంది. చికెన్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ రెసిపీ కూడా చాలా నచ్చుతుంది. చాలా మంది దాబాకు వెళ్లే ఉంటారు. అక్కడ చికెన్ కర్రీని టేస్ట్ చేసే ఉంటారు. ఈ కర్రీ పులావ్, రోటీలు, చపాతీలు వేటిల్లో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. స్పైసీ అంటే ఇష్టం ఉన్నవారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ కర్రీ స్పైసీగా..

Chicken Curry: దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సిందే!
Chicken Curry
Follow us

| Edited By: Phani CH

Updated on: May 07, 2024 | 10:16 AM

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌కి ఫ్యాన్స్ ఎక్కువే. చికెన్ కర్రీ ఎలాంటి పుడ్ ఐటెమ్స్ ప్రిపేర్ చేసినా.. చాలా రుచిగా ఉంటుంది. చికెన్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ రెసిపీ కూడా చాలా నచ్చుతుంది. చాలా మంది దాబాకు వెళ్లే ఉంటారు. అక్కడ చికెన్ కర్రీని టేస్ట్ చేసే ఉంటారు. ఈ కర్రీ పులావ్, రోటీలు, చపాతీలు వేటిల్లో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. స్పైసీ అంటే ఇష్టం ఉన్నవారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ కర్రీ స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. మరి ఈ దాబా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

దాబా స్టైల్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీడి పప్పు, పాలు దాల్చిన చెక్క, లవంగాలు, ఆయిల్ లేదా బటర్.

దాబా స్టైల్ చికెన్ కర్రీ తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని తీసుకుని శుభ్రంగా కడిగి.. పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. కనీసం రెండు గంటల సేపు అయినా మ్యారినేట్ చేసుకుంటేనే రుచి బావుంటుంది. ఇప్పుడు మిక్సీ తీసుకుని.. అందులో జీడిపప్పు, పాలు వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి రంగు మారేంత వరకూ వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఇదే మిశ్రమంలో ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసి ఓ నిమిషం పాటు వేయించాలి.

ఆ నెక్ట్స్ టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించి.. స్టవ్ ఆఫ్ చేయాలి. వీటిని చల్లార్చి మిక్సీలో వేసి పేస్టులా తయారు చేయాలి. మళ్లీ ఇప్పుడు మరో కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేసి కరివేపాకు, మ్యారినేట్ చేసిన చికెన్ వేసి ఓ పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్ వేసి ఓ ఐదు నిమిషాలు కలిపి.. కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మీడియం మంటపై ఓ 20 నిమిషాలైనా ఉడికించండి. చివరగా దించేటప్పుడు కొత్తి మీర వేసుకుంటే చాలు. అంతే ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్ చికెన్ కర్రీ సిద్ధం.

Latest Articles
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!