19 May 2024

ఈసారి మార్కెట్లో స్వీట్ కార్న్‌  కనిపిస్తే వెంటనే కొనేయండి.. 

Narender.Vaitla

కంటి చూపును మెరుగుపరచడంలో స్వీట్‌ కార్న్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ అనే యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటిచూపను మెరుగుపరుస్తాయి.

స్వీట్‌ కార్న్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, పైల్స్‌ వంటి సమస్యలకు దీంతో చెక్‌ పెట్టొచ్చు.

క్యాన్సర్‌ మహమ్మారిని దరిచేరకుండా ఉంచడంలో స్వీట్ కార్న్ ఉపయోగపడుతుంది. ఇందులోని ఫెరూలిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.

స్వీట్‌కార్న్‌లో విటమిన్‌ బీ12 పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ విటమిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా స్వీట్‌ కార్న్‌ ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

ఎముకలను దృఢంగా మార్చడంలో కూడా స్వీట్ కార్న్‌ ఉపయోగపడుతుంది. ఇదులో పుష్కలంగా లభించే మెగ్నీషియం, ఆర్సెనిక్‌ ఎముకలు గట్టిపడడంలో ఉపయోగపడుతుంది.

గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండడంలో స్వీట్‌ కార్న్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫోలెట్ రక్తనాళాలలోని హోమోసిస్టీన్ స్థాయిని తగ్గిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.