AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anti Aging Foods: చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్‌ చేయకండి!

వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక రకాలైన మార్పులు సంభవిస్తుంటాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, మరికొన్ని జీవనశైలి, ఆహారం కారణంగా సంభవిస్తుంటాయి. వృద్ధాప్యంతో చర్మం నిర్జీవంగా మారుతుంది. చర్మం ముడతలు పడి, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి, వీలైనంత యవ్వనంగా కనిపించడానికి ఆహారంలో..

Anti Aging Foods: చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్‌ చేయకండి!
Anti Aging Foods
Srilakshmi C
|

Updated on: May 19, 2024 | 1:18 PM

Share

వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక రకాలైన మార్పులు సంభవిస్తుంటాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, మరికొన్ని జీవనశైలి, ఆహారం కారణంగా సంభవిస్తుంటాయి. వృద్ధాప్యంతో చర్మం నిర్జీవంగా మారుతుంది. చర్మం ముడతలు పడి, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు తెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి, వీలైనంత యవ్వనంగా కనిపించడానికి ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..

ఆకు కూరలు

పాలకూర, మెంతికూర, ఆవాలు వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

టొమాటో

టొమాటోలు లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

బ్లూబెర్రీ

బ్లూబెర్రీస్ మెదడు అభివృద్ధికి అవసరమైన ఆంథోసైనిన్‌లను అందిస్తుంది. వయసు పెరగడం వల్ల శరీరంలో కనిపించే క్షీణతను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

విత్తనాలు

వాల్‌నట్‌లు, బాదం, చియా గింజలు వంటి నట్స్, గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

గుడ్డు

గుడ్డు ప్రోటీన్ పవర్ హౌస్‌గా పిలుస్తారు. ఇందులో (ఒక గుడ్డులో) 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కండరాలు, ఎముకలను బలోపేతం చేయడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం.

నీరు

నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో, విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై