Tollywood: థియేటర్లలో ఢమాల్.. బుల్లితెరపై మాత్రం భళా.. ఆ సినిమాలు ఇవే..

ఒక్కో సారి థియేటర్లో విడుదలైన పలు సినిమాలుు ఆడియెన్స్​ను నిరాశపరుస్తుంటాయి. అప్పటి జనరేషన్‌కు, జనాల మైండ్ సెట్‌కు అవి పెద్దగా నచ్చవు. కొన్నేళ్ల తర్వాత అవే సినిమాలు టీవీల్లో మాత్రం మంచి రేటింగ్స్ సాధిస్తుంటాయి. అలాంటి మూవీస్‌పై ఓ లుక్ వేద్దాం పదండి....

Tollywood: థియేటర్లలో ఢమాల్.. బుల్లితెరపై మాత్రం భళా.. ఆ సినిమాలు ఇవే..
Tollywood Movies
Follow us

|

Updated on: Apr 26, 2024 | 12:25 PM

ప్రజంట్ తెలుగునాట రి రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. పలు క్లాసీ మూవీస్ వెండితెరపై వివిధ అకేషన్స్ సందర్భంగా సందడి చేశాయి. అయితే తొలుత రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడని సినిమాలు కూడా.. టీవీల్లో అత్యధిక రేటింగ్‌ను సంపాదిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి మూవీస్ రీ రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం..

ఆరెంజ్:

గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్​, జెనీలియా జంటగా తెరకెక్కిన ఫీల్​గుడ్ లవ్​స్టోరీ ‘ఆరెంజ్’.  మగధీర తర్వాత వచ్చిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫలితం అనుకున్న విధంగా రాలేదు. బొమ్మరిల్లు భాష్కర్ అప్‌డేటెడ్ ఐడియాను అప్పటి ఆడియెన్స్ రిజెక్ట్ చేశారు. అయితే టీవీల్లో వచ్చినప్పుడు ఈ సినిమాను బాగా ఎంకరేజ్ చేశారు. రీరిలీజ్​లోనూ ఈ సినిమాను చూసేందుకు ఎంతో మంది థియేటర్లకు క్యూ కట్టారు. అంతేకాదు.. అప్పుడు పిల్లలం తెలియక సినిమా ప్లాప్ చేశాం అని కొందరి డైరెక్టర్‌ ముందు మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక చరణ్‌కు కూడా ఈ సినిమా చాలా ఇష్టం. ఎందుకు ప్లాప్ అయిందే తెలియదని ఆయన సన్నిహితుల దగ్గర అంటూ ఉంటారట.

ఖలేజా:

ఖలేజా మూవీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా ఛానల్ మార్చుకుండా చూస్తారు. ఇప్పుడు కూడా టీవీలో దీనికి అదిరిపోయే రేటింగ్ వస్తుంది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా.. తొలుత థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆడియెన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు.

ఓయ్:

ఈ ఏడాది వాలెంటైన్స్​ డే స్పెషల్​గా పలు లవ్ మూవీస్ థియేటర్ల రి రిలీజ్ అయి సందడి చేశాయి. అందులో ‘ఓయ్’ సినిమా ఒకటి. అప్పుడు టాక్ అందుకోని ఈ సినిమాను ఇప్పుడు ఆడియెన్స్ ఓ రేంజ్​లో చూశారు. టీవీలో కూడా సూపర్ టాక్ అందుకుంది ఈ మూవీ.

వేదం :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కీ రోల్స్ పోషించిన ‘వేదం’ మూవీ థియేటర్లలో ఆశించినంతగా ఆడలేదు. అయితే టీవీలో మాత్రం దీనికి మంచి వ్యూవర్​షిప్​ వచ్చింది.

నా ఆటోగ్రాఫ్​ స్వీట్ మెమరీస్​:

మాస్ మహారాజ రవితేజ తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా వెళ్లి నటించిన సినిమా ‘నా ఆటోగ్రాఫ్’. ఈ సినిమా రిలీజైనప్పుడు థియేటర్లలో పెద్దగా ఆడలేదు.  బుల్లితెరపై మాత్రం హిట్ కొట్టింది.

గౌతమ్ నంద:

మాచో హీరో​ గోపిచంద్, హన్సిక, కేథరిన్ ట్రెసా నటించిన ‘గౌతమ్​నంద’కి థియేటర్లలో అంత టాక్ రాలేదు. అయితే ఈ మూవీని టీవీ ప్రేక్షకులు బాగా ఆదరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..