- Telugu News Photo Gallery Technology photos Realme launching new smartphone Realme Narzo 70 features and price details
Realme Narzo 70: రూ. 15వేలకే కళ్లు చెదిరే ఫీచర్లు.. రియల్‌మీ 5జీ ఫోన్
స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో కంపెనీలు భారీగా ధరలను తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 70 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్ సెగ్‌మెంట్‌లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్ఇత వివరా ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 26, 2024 | 12:19 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 70 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం

రియల్‌మీ నార్జో 70 స్మార్ట్ ఫోన్‌లో 45వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. ఇక ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో రియల్‌మీ యూఐ 5.0 వెర్షన్‌ను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే ఐపీ54 రేటెడ్ రెసిస్టెన్స్‌ను అందించారు. 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1200 నిట్స్ పీక్ ట్రైన్‌నెస్‌ను అందించారు.

ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999కాగా 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5జీ ఎస్వోసీ చిప్ సెట్‌తో పనిచేస్తుంది.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 5జీ నెట్‌వర్క్, వై-ఫై, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను ప్రత్యేకంగా అందించారు.




