తండ్రి ఆసుపత్రి బెడ్‌పై.. కొడుకు మరణశయ్యపై.. నటుడి మిస్టరీ డెత్
కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న నటుడు అఖిల్ విశ్వనాథ్ అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లో మృతి చెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు. 'చోళ', 'ఆపరేషన్ జావా' చిత్రాలతో గుర్తింపు పొందిన అఖిల్ మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన తండ్రి ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబానికి తీరని లోటు.
కేరళ రాష్ట్ర అవార్డు అందుకున్న నటుడు అఖిల్ విశ్వనాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెరీ షాకింగ్‌గా.. అఖిల్ తన ఇంట్లోనే మృతి చెంది కనిపించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విచారణ చేపట్టారు. ఇక 2019లో కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న ‘చోళ’ మూవీలో తన పాత్రకుగాను అఖిల్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ‘ఆపరేషన్ జావా’ సహా పలు ప్రముఖ మూవీల్లోనూ నటించాడు. విభిన్న పాత్రలు చేస్తూ అనతి కాలంలోనే అఖిల్ మంచి పేరు దక్కించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో అఖిల్ తన సోదరుడు అరుణ్‌తో కలిసి ‘మాంగాండి’టెలిఫిలింలో నటించాడు. ఈ సినిమాలో అఖిల్ నటనకుగానూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాల నటుడిగా అవార్డును అందుకున్నాడు. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న అఖిల్ జీవితంలో.. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నట్లుండి తన ఇంట్లో శవమై కనిపించాడు. మరోవైపు అఖిల్ తండ్రి విశ్వనాథ్ ఇటీవల జరిగిన ఓ మోటార్ సైకిల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొడుకు కూడా మరణించడం అఖిల్ కుటుంబంలో తీవ్ర విషాదంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్
పెద్ది తెలుగు రికార్డులను కొల్లగొట్టిన పవన్ కల్యాణ్
మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

