గూగుల్ మ్యాప్స్ దారి చూపిస్తుండగా వెళ్లిన ఓ లారీ కృష్ణానదిలోకి దిగింది. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. గద్వాల్ రహదారికి ఆనుకుని ఉన్న కృష్ణానది పుష్కర్ ఘాట్ వద్దకు లారీ వెళ్లింది. నీరు కనిపించగానే డ్రైవర్ బ్రేక్ వేసినట్లు తెలిపాడు.