Ranveer Singh: 2026ని పక్కాగా ప్లాన్ చేసుకున్న రణ్ వీర్ సింగ్
దురందర్ విజయం తర్వాత రణవీర్ సింగ్ కెరీర్ తిరిగి గాడిలో పడింది. వచ్చే ఏడాది మార్చిలో దురందర్ సీక్వెల్ తో పాటు, జాంబీ థ్రిల్లర్ ప్రళయ, డాన్ 3 చిత్రాలను కూడా ఆయన లైన్ లో పెట్టారు. ఈ విజయంతో రణవీర్ సింగ్ 2026 ప్రణాళికలు పక్కాగా ఉన్నాయని తెలుస్తోంది. దీపికా పదుకోన్ కూడా సెట్స్ పైకి తిరిగి వచ్చారు.
ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ అని సినిమా జనాలు అంటుంటే.. ఏంటా ఒక్క హిట్ తాపత్రయం.. అని అనిపించేది కానీ, ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాలను, అవి హీరోల కెరీర్లను గాడిలో పెడుతున్న తీరును చూస్తుంటే ఒక్క హిట్ అనే పదానికున్న పవర్ ఏంటో అర్థమవుతోంది. ఆ ఒక్క హిట్ ఇచ్చిన సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు రణ్ వీర్ సింగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ మేనియానే. దక్షిణాది భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాకపోయినా సినిమా మీద క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. హిందీలోనే చూసేస్తున్నారు జనాలు. అందుకే తెలుగులోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాకు సీక్వెల్‌ని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది యూనిట్. ఇప్పుడు దీనితో పాటు మరిన్ని వైవిధ్యమైన ప్రాజెక్టులను నెక్స్ట్ ఇయర్‌కి లైన్లో పెడుతున్నారు రణ్‌వీర్ సింగ్. ఆయన ప్రధాన పాత్రలో ప్రలే అనే సినిమా తెరకెక్కనుందట. జాంబీ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు డాన్3ని కూడా వచ్చే ఏడాది పూర్తి చేయాల్సి ఉంది రణ్‌వీర్. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో డాన్3 సెట్స్ మీదకు వెళ్తుంది. సో గత కొన్నాళ్లుగా నిదానంగా సాగుతున్న రణ్‌వీర్ కెరీర్‌ని ధురంధర్ గాడిలో పెట్టేసినట్టే అని అంటున్నారు ఫ్యాన్స్. అటు పాప పుట్టిన తర్వాత ఈ ఏడాది మళ్లీ సెట్స్ మీదకు రీ ఎంట్రీ ఇచ్చారు దీపిక పదుకోన్. దంపతులిద్దరికీ 2025 మర్చిపోలేని ఏడాది అంటూ మాట్లాడుకుంటున్నారు ముంబై జనాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
Vijayawada: బెజవాడ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ దోపిడీ
డీమాన్‌ని ఢీ కొట్టి బొక్కబోర్లా పడ్డ కళ్యాణ్.. తనూజ దెబ్బకు షాక్‌లోకి
Pawan Kalyan: పవన్ డ్యాన్స్ ఎఫెక్ట్ షేక్ అవుతున్న సోషల్ మీడియా..
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

