Pawan Kalyan: పవన్ డ్యాన్స్ ఎఫెక్ట్ షేక్ అవుతున్న సోషల్ మీడియా..
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోని 'దేఖ్ లేంగే సాలా' పాట 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. పవన్ డ్యాన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విశాల్ దదలాని వోకల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్.. తొందర్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనూ తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. 30 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అక్రాస్ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నెంబర్.. మంచి బీట్‌తో సూపర్ ఎనర్జిటిక్‌గా సాగుతోంది. భాస్కర భట్ల సాహిత్యం కూడా అందర్నీ ఆకట్టుకుంటోంది. విశాల్ దదలాని వోకల్స్ కూడా ఈ సాంగ్‌ను ఎక్కడో తీసుకెళ్లింది. దానికి తోడు చాలా కాలం తర్వాత ఈ సాంగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డ్యాన్స్ అదరగొట్టేశారు. ఇప్పుడిదే క్రేజీ ఎలిమెంట్‌గా మారింది. పవన్ ఫ్యాన్స్‌ను ఎగిరి గంతేసేలా చేస్తోంది. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పవన్ జోడీగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: అఖండ2 థియేటర్లో అఘోరాలు.. వైరల్‌గా వీడియో..
Top9 ET News: సుజీత్‌కు పవర్ స్టార్ రెండున్నర కోట్ల కానుక
సీన్ రివర్స్… ఓటింగ్ ఫలితాల్లో భారీ తేడా
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

