Akhanda 2: అఖండ2 థియేటర్లో అఘోరాలు.. వైరల్‌గా వీడియో..
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందుత్వం, సనాతన ధర్మాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా బాలయ్య అఘోరా పాత్ర నట విశ్వరూపం చూపిస్తుండగా, థియేటర్లలో నిజమైన అఘోరాలు సినిమా వీక్షించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ అద్భుత ఘట్టం సినిమాకు మరింత ప్రచారం తెచ్చింది.
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో హిందుత్వం, దైవ భక్తి, సనాతన ధర్మం వంటి అంశాలను చక్కగా చూపించడంతో ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ తో పాటు కామన్ అడియన్స్, పిల్లలు సైతం ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అఖండ 2 తాండవం సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించారు. బాల మురళీ కృష్ణ పాత్ర తో పాటు అఖండ రుద్ర సికందర్ అఘోరా గా కనిపించాడు. ముఖ్యంగా అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారు బాలయ్య. సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన డైలాగులు, విలన్లను మట్టి కరిపించే సన్నివేశాలను చూసి ఆడియెన్స్ చప్పట్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో అఖండ 2 సినిమాకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో కొందరు అఘోరాలు థియేటర్‌కి వచ్చి ‘అఖండ 2’ సినిమాను వీక్షించడం మనం చూడవచ్చు. సినిమాలో బాలయ్య శివ తాండవాన్ని చూసిన అఘోరాలు పలు సందర్భాల్లో తమ సీట్ల నుంచి పైకి లేచి చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన విభూతి కాషాయ యోగులు అని ఈ వీడియో షేర్ చేసిన నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Top9 ET News: సుజీత్‌కు పవర్ స్టార్ రెండున్నర కోట్ల కానుక
సీన్ రివర్స్… ఓటింగ్ ఫలితాల్లో భారీ తేడా
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

