- Telugu News Photo Gallery Is storing eggs in the fridge a benefit or disadvantage? What do experts say?
గుడ్లు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే.. లాభమా.? నష్టమా.? వైద్యుల మాటేంటి.?
మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు ఎలాంటి వస్తువులు అయినా ఫ్రిజ్‌లో పెట్టి తినడం అంత మంచిది కాదు. ఏవైనా సరే వాటి గడువులోగా పాడవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ వీటి గడువు కాలాన్ని పొడిగించి..
Updated on: Dec 17, 2025 | 1:30 PM

మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు

ఎలాంటి వస్తువులు అయినా ఫ్రిజ్‌లో పెట్టి తినడం అంత మంచిది కాదు. ఏవైనా సరే వాటి గడువులోగా పాడవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ వీటి గడువు కాలాన్ని పొడిగించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఎక్కువ రోజులు గుడ్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటి పోషకాలు అందకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని ఫ్రిడ్జ్‌లో ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది.

గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్తే ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి. ఈ బ్యాక్టీరియా వలన విరేచనాలు, వాంతులు అవుతాయి. గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఇది ఇతర ఆహార పదార్థాల పైకి కూడా చేరుతుంది.

గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదు. నిల్వ చేసినా ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి స్టోరేజ్ చేయాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి. అప్పటి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు.




