ఐటీ రంగంలో హెచ్ఐవి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదిక వెల్లడించింది. సుదీర్ఘ పని గంటలు, ఒత్తిడి, ఆధునిక జీవనశైలి, వీకెండ్ పార్టీలు, ఆల్కహాల్, డ్రగ్స్ వినియోగం, మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ వంటివి ప్రధాన కారణాలుగా పేర్కొంది. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుతున్నా, ఐటీ సెక్టార్ నుండే అధికంగా నమోదవుతున్నాయి.