అతడంటే పిచ్చి.. తన నవ్వును అలా చూస్తూ ఉండిపోయేదాన్ని.. మృణాల్..
Rajitha Chanti
Pic credit - Instagram
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ మూవీతో అమ్మాడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
దీంతో తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ అంతకుముందు ఈ ముద్దుగుమ్మ హిందీలో పలు హిట్ చిత్రాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే మృణాల్ అభిమాన నటుడు షాహిద్ కపూర్ అని వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఆయనతో కలిసి నటించిన జెర్సీ సినిమా ఆన్ లోకేషన్ అనుభావాన్ని మీడియా ముందు బయటపెట్టింది. షాహిద్‌తో జరిగిన సీన్ గుర్తుచేసుకుంది.
షాహిద్ అంటే తనకు చాలా ఇష్టమని... అలాంటి తనకు అతడితో కలిసి నటించే అవకాశం రావడంతో వెంటనే ఓకే చేశానని చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.
షాహిద్ నవ్వు అంటే చాలా ఇష్టమని.. లొకేషన్లో ఆయన నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయేదాన్ని అని.. సినిమాల్లోనే కాకుండా రియల్‌గా నవ్వు చాలా బాగుంటుందని తెలిపింది.
ఒక సీన్లోనే షాహిద్‌ను కొట్టాలని .. కానీ ఆ సీన్ చేయడానికి ఎంతో ఇబ్బందిపడినట్లు తెలిపింది. ఆ ఒక్క సీన్ చేయడానికి దాదాపు మూడు గంటలకు సమయం పట్టిందట.
షాట్ బాగా రావడానికి రెండుమూడు సార్లు కొట్టాల్సి వచ్చిందని.. తన జీవితంలో నటిగా బాగా ఇబ్బందిపడ్డ సీన్ అదే అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్.