AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీజీ.. నార్తే కాదు.. సౌత్ కూడా ఉంది..

150వ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు పట్ల.. తెలుగు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మోదీ పక్షపాతంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియా ద్వారా తమ వాదనలు తెలియజేస్తున్నారు. 150వ గాంధీ జయంతి సందర్భంగా మోదీ ఓ  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని మాత్రమే అహ్వానించారు. అంతేకాకుండా గాంధీ భావాలను, ఐడియాలను ప్రజలకు చేరువ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సినిమా రంగం ఎక్కువగా దోహదపడుతుందని చెబుతూనే హిందీ ఫిల్మ్ […]

మోదీజీ.. నార్తే కాదు.. సౌత్ కూడా ఉంది..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 20, 2019 | 10:36 AM

Share

150వ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు పట్ల.. తెలుగు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మోదీ పక్షపాతంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియా ద్వారా తమ వాదనలు తెలియజేస్తున్నారు. 150వ గాంధీ జయంతి సందర్భంగా మోదీ ఓ  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని మాత్రమే అహ్వానించారు. అంతేకాకుండా గాంధీ భావాలను, ఐడియాలను ప్రజలకు చేరువ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సినిమా రంగం ఎక్కువగా దోహదపడుతుందని చెబుతూనే హిందీ ఫిల్మ్ సెలబ్రిటీలను మాత్రమే ప్రశంసించారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్క స్టార్‌ని కూడా ఆహ్వానించలేదు. దాంతో సౌత్ ప్రజలంతా మోదీ పక్షపాత బుద్ధిపై తీవ్ర వ్యతిరేకతని వ్యక్తం చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. డియర్ నరేంద్ర మోదీ గారు, మేము సౌత్ ఇండియన్స్.. మీ పాలనని అభిమానిస్తూ, మీరు ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతాం. కానీ మీ దృష్టిలో సినీ సెలబ్రిటీస్ మరియు కల్చరల్ ఐకాన్స్ కేవలం హిందీకి మాత్రమే పరిమితమా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం నన్ను ఎంతో బాధ పెట్టింది. అందుకే ప్రశ్నిస్తున్నా.. ఇది మీకు కరెక్ట్ గా రీచ్ అవుతుందని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు.

ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్‌కి ఎంతో మంది నెటిజన్స్ మద్దతుగా నిలిచారు. ఎందుకంటే దక్షిణాది సినిమా కూడా దేశానికి ఎంతో సపోర్ట్ చేస్తోంది. అలాగే ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడంలో తెలుగు చిత్రసీమ కృష్టి ఎంతో ఉంది. అంతేకాక, బాహుబలి, సాహో, సైరా లాంటి పాన్ ఇండియన్ మూవీస్‌‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిన విషయమే.

Follow Us