మహాత్మ విదురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో నీతి వ్యాఖ్యలను తెలియజేయడం జరిగింది.
మహాత్మ విదురుడు
అదే విధంగా మహాత్మ విదురుడు ఒక వ్యక్తి ఆయువును తగ్గించే పనుల గురించి కూడా తెలియజేయడం జరిగింది, అవి ఏవో చూద్దాం.
ఆయువు తగ్గించే పనులు
ధృతరాష్ట్రుడు ఒక వ్యక్తి ఆయువు ఏ కారణం చేత తగ్గిపోతుంది అనగా, దానికి విదురుడు సమాధానం ఇస్తూ ఈ కింది విషయాలను తెలియజేయడం జరిగింది.
ధృతరాష్ట్రుడు
అహంకారం మనిషి జీవితాన్ని చాలా నాశనం చేస్తుంది. అలాంటి వ్యక్తి ఎదుటి వారి మాటలను లెక్క చేయడు, తన అహంకారంతో తానే చాలా సమస్యలు ఎదుర్కొంటాడు.
అహంకారం
ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కూడా చాలా త్వరగా మరణిస్తాడంట. ఎందుకంటే? ఎక్కువగా మాట్లాడే వారి తెలివి తేటలు, వయసు క్రమంగా క్షీణించడం ప్రారంభం అవుతుంది.
ఎక్కువగా మాట్లాడే వ్యక్తి
త్యాగ స్పూర్తి లేని వ్యక్తి జీవితం కూడా చాలా త్వరగా ముగిసిపోతుందంట. కుటుంబంలో శాంతి, ఆనందం కోసం ఎప్పుడూ త్యాగం చేస్తూ ఉండాలి.
త్యాగ స్పూర్తి లేని వ్యక్తి
కోపం మనిషికి అతి పెద్ద శత్రువు, ఎక్కువ కోపంతో ఉండే మనిషి, కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎక్కువగా చింతిస్తూ ఉంటాడు, ఇతరులను బాధ పెడతారు, అలాంటి వారు కూడా త్వరగా మరణిస్తారు.
కోపం
స్వార్థమే అన్ని సమస్యలకు మూలం. స్వార్థపరుడు తన స్వార్థం కోసం అతి పెద్ద పెద్ద పాపాలు చేయడానికి కూడా వెనకాడడు, అలాంటి వారు కూడా త్వరగా మరణిస్తారంట.